సహజీవనభాగస్వామి మీద అనుమానంతో సలసల కాగే నూనె పోసిందో మహిళ. ఈ ఘటన గుంటూరులో వెలుగు చూసింది.
గుంటూరు : నిద్రిస్తున్న సహజీవనభాగస్వామి మీద ఓ మహిళ సలసల కాగే నూనె పోసింది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా నకిరికల్లులో బుధవారం ఈ ఘటన వెలుగు చూసింది. నకిరికల్లుకు చెందిన జగన్నాధపు నాగమణి, అతుకూరి నాగరాజు కొన్నేళ్లుగా సహజీవనంలో ఉన్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోకపోయినా భార్యాభర్తలుగా కలిసి జీవిస్తున్నారు. అయితే నాగమణికి పిల్లలు పుట్టే అవకాశం లేదు.
దీంతో నాగరాజు సంతానం కోసం మరో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని నాగమణి అనుమానించింది. దీంతో తరచుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. తనను కాదని మరో మహిళను పెళ్లి చేసుకోవాలను కుంటున్న నాగరాజును ఎలాగైనా అడ్డుతప్పించుకోవాలనుకుంది. ఈనెల 26వ తేదీన నాగరాజు ఇంట్లో పడుకుని ఉండగా.. ఇంట్లో ఉన్న నూనెను సలసలా మరిగించి నాగరాజు ఒంటిమీద పోసింది.
లోకేష్ పాదయాత్ర అడ్డుకోవాలనే.. తాడేపల్లి నుంచే ఆదేశాలు : వినుకొండలో ఘర్షణపై జీవీ ఆంజనేయులు
అనుకోని ఈ ఘటనకు నాగరాజు తీవ్రంగా గాయపడ్డాడు. కేకలు వేయడం ప్రారంభించాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు 108 కి ఫోన్ చేశారు. వారు వచ్చి వెంటనే నాగరాజును హుటాహుటిన నరసరావుపేటలోని ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు నాగరాజు వాంగ్మూలాన్ని నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
ఇదిలా ఉండగా, భార్యపై అనుమానంతో ఓ భర్త వేడి నీరు ఆమె ముఖం మీద కొట్టాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురంలో కలకలం రేపింది. సోమవారం ఈ ఘటన వెలుగు చూడగా.. బాధితురాలు పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది. ఇక్కడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…దమయంతి, తాడంగి ప్రసాద్ దంపతులు. వీరిద్దరూ టిఫిన్ బండి నడుపుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నారు.
కాగా, కొంతకాలంగా ప్రసాద్ కు భార్య మీద అనుమానం కలిగింది. దీంతో చిన్నదానికి పెద్ద దానికి ఆమెతో గొడవ పడుతుండేవాడు. సోమవారం నాడు టిఫిన్ కోసం ఓ యువకుడు వారి షాప్ కి వచ్చాడు. ఆమె అతనికి పార్సిల్ కడుతోంది. అప్పుడే వచ్చిన ప్రసాద్ ఆమె మీద అనుమానపడ్డాడు. అంతే వేడివేడి మీరు ఆమె ముఖం మీద కొట్టాడు.
అనుకోని ఈ పరిణామానికి ఒకసారిగా షాక్ అయినా భార్య గట్టిగా కేకలు వేసింది. వేడినీరు పడడంతో ముఖం మీద, నుదురుపై గాయాలయ్యాయి. పక్కనే ఉన్న ఆమె కూతురు పవిత్ర మీద కూడా వేడినీరు పడడంతో బొబ్బలెక్కాయి. విషయం తెలిసిన దమయంతి తల్లిదండ్రులు ఆమెను చికిత్స కోసం పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. దీనిమీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
