Asianet News TeluguAsianet News Telugu

పోలీస్ స్టేషన్ కు తాళం వేసిన మహిళ... ఎందుకంటే...

తన సమస్య గురించి వెడితే పోలీసులు పట్టించుకోవడం లేదని.. ఓ మహిళ ఏకంగా పోలీస్ స్టేషన్ కే తాళం వేసింది. ఈ ఘటన పెందుర్తిలో వెలుగు చూసింది. 

woman locked police station in Visakhapatnam - bsb
Author
First Published Oct 18, 2023, 8:33 AM IST | Last Updated Oct 18, 2023, 8:33 AM IST

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో విచిత్ర ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ ఏకంగా పోలీస్ స్టేషన్ కే తాళం వేసింది. తన సమస్య పరిష్కారం కోసం రోజుల తరబడి తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఈ పని చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ ఘటన విశాఖ జిల్లా పెందుర్తి లో వెలుగు చూసింది. ఓ మహిళ గత ఐదు రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతోంది. అయినా ఆమెను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. దీంతో విసుగుచెందిన ఆ మహిళ ఏకంగా పోలీస్ స్టేషన్ కే తాళం వేసింది. ఇది చూసిన పోలీసులు.. ఆ మహిళకు నచ్చజెప్పి.. తాళం తీశారు. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios