మండలంలోని కేజేపురం ఎంపీ టీసీ సభ్యురాలు రాపేటి నారాయణమ్మ ఆ పార్టీకి రాజీనామాచేయనున్నట్టు ప్రకటించారు. ఇక్కడి విలేఖరులతో ఆ విషయాన్ని చెప్పారు. వైసీపీ తరఫున ఎంపీటీసీ సభ్యురాలిగా ఎన్నికైన తాను గ్రామాభివృద్ధి దృష్యా టీడీపీలో చేరినా ఉపయోగం లేకపోయిందన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గవిరెడ్డి రామానాయుడు ఇప్పటి వరకు ఒక్కరూపాయి కూడా మంజూరు చేయకుండా అన్యాయం చేశారని ఆరోపించారు.

తమ గ్రామానికి చెందిన రాపేటి జగ్గారావు పింఛన్‌ పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో గాని, ఇతర సమావేశాల్లో గాని తనకు ఎలాంటి ప్రత్యేకత ఉండడం లేదన్నారు. అందుకే తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.