ఆమెకు పెళ్లై చక్కని సంసారం ఉంది. ఆ సంసారాన్ని పరాయి వ్యక్తి మోజులో పడి నాశనం చేసుకుంది. భర్తను కాదని మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడితో రాసలీలలకు భర్త అడ్డుగా ఉన్నాడని భావించింది. సినిమా రేంజ్ లో లారీ తో గుద్దించి మరీ హత్య చేసింది. ఈ దారుణ సంఘటన మదనపల్లిలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 పెద్దమండ్యం మండలం సిద్దవరం పంచాయతీ చెరువుముందరపల్లెకు చెందిన నాగలక్ష్మి, చిన్నరెడ్డెప్పల కుమారుడు బాలసుబ్రహ్మణ్యం(35)కు 11ఏళ్ల క్రితం మదనపల్లెలోని నీరుగట్టువారిపల్లెకు చెందిన రేణుకను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లపాటు పట్టణంలోని కదిరి రోడ్డులో గిఫ్ట్‌ సెంటర్‌ నిర్వహించిన బాలసుబ్రహ్మణ్యం వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాడు. 

Also Read మిఠాయి కొనిపెడతానని చెప్పి.. నాలుగేళ్ల చిన్నారిపై తాత అఘాయిత్యం...

దీంతో రెండేళ్ల క్రితం తిరుపతికి వెళ్లి అక్కడ ట్రావెల్స్‌ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. రేణుక మాత్రం ముగ్గురు పిల్లలతో కలిసి మదనపల్లెలోనే ఉంటోంది. ఈ క్రమంలోనే ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు కె.నాగిరెడ్డితో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారి తీసింది. అతడితో రాసలీలలు సాగించేందుకు ఆ పార్టీలో మహిళా కార్యకర్తగా చేరింది.

భర్త ఎలాగూ దగ్గర ఉండడు కాబట్టి.. ఆమె రాసలీలలకు అడ్డు లేకుండా పోయింది. అయితే.. అనుకోకుండా భర్త ఇంటికి రావడంతో ప్రియుడితో రాసలీలలకు ఇబ్బందిగా మారింది. దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించింది. ఈ క్రమంలో ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. 

పథకం ప్రకారం ప్లాన్ వేసి.. భర్తను మందుల షాపు పేరిట బయటకు పంపి... లారీతో గుద్దించి హత్య చేసింది. అయితే.. బాల సుబ్రహ్మణ్యం చావు అతని సోదరుడిలో పలు అనుమానాలకు తావితీసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా... వారి విచారణలో అసలు విషయాలు బయటపడ్డాయి. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు చెప్పారు.