భార్య, భర్తల మధ్య చిన్నపాటి మనస్పర్థలు రావడం సహజం. కానీ.. ఆ  చిన్నపాటి గొడవ కారణంగా భార్య తీవ్ర ఆవేశానికి గురైంది. కాగా.. ఆమె ఆవేశం చివరకు భర్త ప్రాణం తీసింది. ఈ విషాదకర సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం మున్సిపల్ పరిధిలోని దొడగట్ట గ్రామానికి చెందిన శ్రీనివాసులు, సరిత దంపతుల మధ్య ఆదివారం రాత్రి గొడవ జరిగింది. చాలా సేపు భార్యభర్తలు వాధించుకున్నారు. ఈ క్రమంలో భార్య సునీతకు పట్టరాని కోపం వచ్చేసింది. తీవ్ర ఆవేశానికి గురైంది. 

ఈ క్రమంలో ఆవేశానికి గురైన భార్య సరిత.. తన భర్త శ్రీనివాసులుని కర్రతో బలంగా కొట్టింది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన శ్రీనివాసులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. దీంతో శ్రీనివాసులు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సరితను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు చెప్పారు.