దారుణం: ఎలుగుబంటి దాడిలో మహిళ మృతి,ఆరుగురికి గాయాలు

Woman killed in bear attack
Highlights

ఎలుగుబంటి దాడిలో శ్రీకాకుళం జిల్లాలో విషాదం

 

శ్రీకాకుళం:శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ఎలుగుబంటి దాడిలో నిర్మల(45) అనే మహిళ మృతిచెందింది. కొబ్బరితోటలో చెత్త పారవేసుకుందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో ఆరుగురికి కూడా గాయాలు అయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే గ్రామస్తులు సంఘటనాస్థలానికి చేరుకుని ఎలుగుబంటిని కొట్టి చంపారు. ఎలుగుబంట్ల సంచారంతో ఎర్రముక్కాం గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. 

loader