Asianet News TeluguAsianet News Telugu

వాగు మధ్యలోనే మహిళ ప్రసవం

మొదట సునీతకు పురిటినొప్పులు రాగా బంధువులు స్థానిక వలంటీర్‌ సహాయంతో 108 వాహనానికి సమాచారం అందించారు. అయితే గత రాత్రి కురిసిన వర్షాలకు వాగు నిండుగా ప్రవహిస్తుండటంతో 108 వాహనం వాగు దాటే పరిస్థితి లేదు. స్థా

Woman Gave Birth in middle stream
Author
Hyderabad, First Published Sep 21, 2020, 8:50 AM IST

వాగు దాటుతుండగా  ఓ మహిళ మధ్యలోనే ప్రసవించింది. ఈ దారుణ సంఘటన  చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఓ నిండు గర్భిణీకి నొప్పులు రావడంతో.. ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా.. మధ్యలోనే బిడ్డను ప్రసవించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలం అంజూరు పంచాయతీ జయలక్ష్మీపురం గ్రామం పరిస్థితి ఇది. ఈ క్రమంలో ఆదివారం గ్రామానికి చెందిన సునీత (25) అనే గిరిజన గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు వాగు దాటిస్తుండగా మధ్యలోనే ప్రసవించింది.


మొదట సునీతకు పురిటినొప్పులు రాగా బంధువులు స్థానిక వలంటీర్‌ సహాయంతో 108 వాహనానికి సమాచారం అందించారు. అయితే గత రాత్రి కురిసిన వర్షాలకు వాగు నిండుగా ప్రవహిస్తుండటంతో 108 వాహనం వాగు దాటే పరిస్థితి లేదు. స్థానికులు ఆటోలో కొబ్బరి మట్టల సహాయంతో గర్భిణిని గ్రామం నుంచి తీసుకొచ్చి వాగు దాటించే ప్రయత్నం చేశారు. పురిటినొప్పులు అధికమవ్వడంతో వాగు మధ్యలోనే గర్భిణికి కాన్పు చేశారు. ఆపై 108లో శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లి బిడ్డా క్షేమంగా ఉన్నట్లు సమాచారం.     

Follow Us:
Download App:
  • android
  • ios