తిరుపతిలో ఓ మహిళను మింగేసిందో లిఫ్ట్. అపార్ట్ మెంట్ లిఫ్ట్ లో పడి ఓ వాసంతి అనే మహిళ ప్రాణాలు విడిచింది. తిరుపతిలో వరుసగా లిఫ్ట్ ప్రమాదాలు భయపెడుతున్నాయి. 

షార్ స్టోర్స్ పర్చేజ్ వింగ్ విభాగంలో సీనియర్ అధికారిణిగా పనిచేస్తున్న వాసంతి అనే మహిళ డీబీఆర్ హాస్పిటల్ రోడ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నారు. ఆమె నివాసం నాలుగో అంతస్తులో ఉంది. 

బైటికి వెళ్లేందుకు లిఫ్ట్ దగ్గరికి వచ్చిన వాసంతి లిఫ్ట్ బటన్ నొక్కారు. అయితే లిఫ్ట్ పూర్తిగా పైకి రాకుండానే లిఫ్ట్ డోర్ తెరుచుకుంది. చీకటిగా ఉండడం, లిఫ్ట్ డోర్ తెరుచుకోవడంతో వాసంతి అందులోకి అడుగుపెట్టింది. వెంటనే లిఫ్ట్ ఎలివేటర్ మీద పడిపోయింది. 

దీంతో క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అపార్ట్మెంట్ వాసుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. ఈ నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యులో తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు.