గుంటూరు జిల్లా పెదకూరపాడులో దారుణం చోటు చేసుకుంది. పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ బాలకృష్ణన్ వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్యాయత్నం చేశారని ఆరోపణలు ఉన్నాయి.

దీంతో బాలకృష్ణన్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆయనపై గత కొంతకాలంగా వేధింపుల ఆరోపణలు వున్నాయి. మరోవైపు బాలకృష్ణన్‌పై ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. విచారణ కమిటీ ఎదుట అనేక మంది బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఎక్సైజ్ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది.