ఓ మహిళ మైనర్ బాలికను మభ్యపెట్టి భర్త దగ్గరికి తీసుకువెళ్లిన ఘటన కర్నూలులో వెలుగు చూసింది. ఆ భర్త ఆమె మీద లైంగిక దాడికి ప్రయత్నించాడు.
కర్నూలు : ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజిల్లలో దారుణం జరిగింది. బోడెమ్మ, బడేసాబ్ భార్యాభర్తలు. వీరి నిర్వాకం మీద గ్రామస్తులు ఆందోళనకు దిగారు. బోడెమ్మ గ్రామంలోని ఓ బాలికను మభ్యపెట్టి.. భర్త బడేసాబ్ దగ్గరికి తీసుకువెళ్లింది. ఆ బాలిక మీద బడేసాబ్ లైంగిక దాడికి ప్రయత్నించాడు.
దీంతో ఆ బాలిక ఎలాగో అతడినుంచి తప్పించుకుని.. ఇంటికి చేరుకుంది. విషయం తెలియడంతో బాధిత బాలిక కుటుంబసభ్యులు, గ్రామస్తులు భార్యాభర్తల తీరుపై మండిపడ్డారు. వారిద్దరినీ అరెస్ట్ చేయాలంటూ గ్రామంలో నిరసన తెలిపారు. విషయం తెలియడంతో పోలీసులు గ్రామానికి వచ్చి.. భార్యాభర్తలిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.