Asianet News TeluguAsianet News Telugu

పది రోజుల్లో పెళ్లి.. చెవులు, ముక్కుల్లోంచి రక్తం కారి మహిళా కానిస్టేబుల్ మృతి....

ఉద్యోగం తర్వాత  పెళ్లితో  తమ కూతురు జీవితం సంతోషంగా ఉంటుందని భావించిన ఆ తల్లిదండ్రుల  ఆశకు10 రోజుల్లోనే తీరని నిరాశ ఎదురయింది.  గత పది రోజుల నుంచి  అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నాలుగు రోజుల క్రితం వైద్య పరీక్షలు చేయించుకోగా, బ్లడ్ క్యాన్సర్ అని వైద్యులు నిర్ధారించారు.

woman constable sudden death due to blood cancer in vijayawada
Author
Hyderabad, First Published Nov 20, 2021, 1:49 PM IST

విజయవాడ : కాళ్లకు పారాణి పెట్టుకుని పట్టువస్త్రాలతో పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఆ యువతి నిస్తేజంగా పడిపోయింది. అనుకున్న లక్ష్యాన్ని చిన్నవయసులోనే అధిగమించి… కొంగొత్త ఆశలతో కొత్త జీవితం వైపు పరుగులు పెడుతున్న సమయంలో విధి వైచిత్రికి తల వంచాల్సి వచ్చింది. ఉన్నపాటున  
Blood cancer రూపంలో  విరుచుకుపడ్డ మృత్యువు..  కోలుకునే అవకాశం ఇవ్వకుండా  కబలించింది.  ఆశలు సమాధి చేసింది. కన్నవారికి కన్నీటి  వేదనను మిగిల్చింది.

సేకరించిన వివరాలు ఇవి…
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం నందమూరి గ్రామానికి చెందిన పరస  శ్రీరమ (21) అజిత్ సింగ్ నగర్  పోలీస్ స్టేషన్లో Women Constableగా విధులు నిర్వహిస్తోంది.  19 ఏళ్లకే కానిస్టేబుల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం సంపాదించింది. 2020 బ్యాచ్ కు చెందిన శ్రీరమ శిక్షణ పూర్తయిన తర్వాత తొలిసారిగా గతేడాది సెప్టెంబర్లో విజయవాడ Ajit Singh Nagar మహిళా కానిస్టేబుల్ గా బాధ్యతలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఈ నెల 28వ తేదీన శ్రీరమ వివాహం కూడా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

'ఒరేయ్ నాని, వంశీ జాగ్రత్తగా ఉండండి.. గాజులు తొడుక్కుని కూర్చోలేదు'.. నందమూరి రామకృష్ణ వార్నింగ్..

తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందని, వాళ్లు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే .. ఇక దైవం ఎందుకు... అందుకే ఆ యువతికి పాతికేళ్లు కూడా నిండకుండానే నిండు నూరేళ్లూ నిండేలా చేశాడు. బ్లడ్ క్యాన్సర్ రూపంలో మృత్యువును ముంగిట నిలిసాడు.

కన్నవారి కలలు కల్లలు…
ఉద్యోగం తర్వాత  పెళ్లితో  తమ కూతురు జీవితం సంతోషంగా ఉంటుందని భావించిన ఆ తల్లిదండ్రుల  ఆశకు10 రోజుల్లోనే తీరని నిరాశ ఎదురయింది.  గత పది రోజుల నుంచి  అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నాలుగు రోజుల క్రితం వైద్య పరీక్షలు చేయించుకోగా, బ్లడ్ క్యాన్సర్ అని వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలిసి ముందుగా శ్రీరమ తీవ్ర ఆందోళన చెందింది. తరువాత ధైర్యాన్ని కూడదీసుకుని.. తనకు ఆ వ్యాధి ఎలా వచ్చింది? ఎలా తగ్గించుకోవాలి? అని తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ లోపే ఆమె తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించాల్సి వచ్చింది.

Weather Update : ఈ రోజు కూడా రాయలసీమలో భారీ వర్షాలు

బుధవారం మధ్యాహ్నం  విధుల్లో ఉన్న శ్రీరమకు చెవుల్లో,  ముక్కుల్లో నుంచి ఒక్కసారిగా Blood రావడంతో  అక్కడికక్కడే  కుప్ప కూలి పడిపోయింది.స్టేషన్ సిబ్బంది వెంటనే ఆమెను  చికిత్స నిమిత్తం ఒక ప్రైవేట్  హాస్పిటల్కు తరలించారు.  అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తీసుకువెళ్లారు. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె గురువారం అర్ధరాత్రి దాటాక తుదిశ్వాస విడిచింది.

స్టేషన్ సిబ్బంది నివాళి…
సింగ్ నగర్ స్టేషన్ సిబ్బంది, ఆమె స్వగ్రామం నందమూరి గ్రామ వాసులంతా కన్నీటి పర్యంతం అవుతున్నారు. స్టేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ సిబ్బంది అంతా శుక్రవారం శ్రీరమ అంత్యక్రియల్లో పాల్గొని నివాళులు అర్పించారు.

Follow Us:
Download App:
  • android
  • ios