ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ ఆద్యాత్మిక పట్టణం తిరుమలతో దారుణం చోటుచేసుకుంది. మరుగుదొడ్లో ఒంటికి నిప్పంటించుకుని ఓ నిరుపేద మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. 

తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని సన్నిధిలో దారుణం చోటుచేసుకుంది. తిరుపతి జిల్లాలోని తిరుమలో ఓ మహిళకు ఏ కష్టం వచ్చిందో ఏమోగానీ ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణానికి పాల్పడింది. వరాహస్వామి విశ్రాంతి గృహం ఎదురుగా గల మరుగుదొడ్డిలో మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు విజయవాడకు చెందిన సుమతి(53) గా గుర్తించారు. తిరుమలలోని ఓ హోటల్లో ఆమె పనిచేస్తున్నట్లు సమాచారం. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి వుంది.

నిన్న(ఆదివారం) రాత్రి 10గంటల సమయంలో తిరుమల వరాహస్వామి రెస్ట్ హౌస్ ఎదుటగల మరుగుదొడ్డిలోంచి భారీగా పొగల రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మరుగుదొడ్లోకి వెళ్లిచూడగా ఓ మహిళ మంటల్లో దహనమవుతూ కనిపించింది. దీంతో వెంటనే ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేసి మహిళను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితంలేకుండా పోయింది. అప్పటికే మహిళ శరీరం మంటల్లో పూర్తిగా కాలిపోవడంతో ప్రాణాలు పోయాయి.

Read More భర్తతో వాగ్వాదం.. క్షణికావేశంలో చిన్నారి ఊయల చీరనే ఉరిగా చేసుకుని భార్య ఆత్మహత్య...

మహిళ ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.