అఫైర్: కూతురి మర్మాంగాలపై బ్లేడుతో గాట్లు పెట్టిన తల్లి

Woman attempt to kill daughter
Highlights

ఓ మహిళ తన కన్నకూతురి పట్లనే అత్యంత నీచంగా వ్యవహరించింది.

రాజమండ్రి: ఓ మహిళ తన కన్నకూతురి పట్లనే అత్యంత నీచంగా వ్యవహరించింది. కూతురిని చంపేందుకు ప్రయత్నించింది. ఏడేళ్ల కూతురికి చీమల మందు తాగించి స్పృ కోల్పోయిన తర్వాత నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకుని వెళ్లి బ్లేడుతో కర్కషంగా గాట్లు పెట్టింది. 

కూతురు చనిపోయిందని భావించి ఇంటికి వెళ్లింది. అయితే, స్పృహలోకి వచ్చిన చిన్నారి అతి కష్టం మీద అమ్మమ్మ ఇంటికి చేరింది. దాంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన ఈ ఘటన వివరాలను ఈస్ట్ జోన్ డిఎస్పీ బుధవారం వెల్లడించారు.
 
దివాన్‌చెరువుకు చెందిన మచ్చా శారదకు ఇద్దరు కూతుళ్లు. భర్త వదిలేయడంతో హోటల్లో పనిచేస్తూ మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈనెల 18వ తేదీన పని నుంచి ఇంటికి వచ్చేసరికి పెద్ద కూతురు మహాలక్ష్మి అల్లరి చేయడం చూసి తీవ్రంగా కొట్టింది. దీంతో మహాలక్ష్మి దగ్గరలోని అమ్మమ్మ ఇంటికెళ్లింది. 
దాంతో వదిలేయకుండా అక్కడి నుంచి ఆ చిన్నారిని కొట్టుకుంటూ ఇంటికి తీసుకుని వచ్చింది. ఆపై చీమల మందు తాగించింది. పాప స్పృహ కోల్పోయిన తర్వాత అర్ధరాత్రి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కాళ్లు చేతులు కట్టేసి, ఆమె శరీరంపై బ్లేడుతో విచక్షణారహితంగా కోసింది.
 
బాలిక మర్మాంగాలపైనా బ్లేడుతో గాయపర్చింది. ఆ తర్వాత చనిపోయిందని భావించి ఇంటికి వెళ్లింది. చిన్నారి ఏదో విధంగా కట్లు విప్పుకుని అమ్మమ్మ ఇంటికి చేరింది. చిన్నారిని ఆస్పత్రికి తరలించగా ఆమె శరీరంపై ఉన్న గాయాలకు డాక్టర్లు 103 కుట్లు వేశారు. 

బాలిక ఫిర్యాదుతో శారదను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. 

TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader