నరసాపురం: ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 120 సీట్లతో అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. 

ఇకపోతే నరసాపురం లోక్ సభ నియోజకవర్గంలో తాను లక్ష 20 వేల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు రఘురామకృష్ణంరాజు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. 

మరోవైపు తన నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు చేశారని, దాడులు చేశారంటూ వస్తున్న వార్తలు సరికాదన్నారు. కేవలం స్టేట్మెంట్ కోసమే వచ్చారని రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

స్టేట్మెంట్ కోసం వచ్చారు, దాడులు చెయ్యలేదు: సీబీఐ సోదాలపై వైసీపీ నేత రఘురామకృష్ణంరాజు

వైసీపీ నర్సాపురం ఎంపీ అభ్యర్ధి ఇంటిపై సీబీఐ దాడులు