వైసీపీ నేత, నర్సాపురం లోక్‌సభ అభ్యర్ధి రఘురామకృష్ణంరాజు ఇంటిలో సీబీఐ దాడులు నిర్వహించడం కలకలం రేపింది. మంగళవారం ఉదయం హైదరాబాద్‌తో పాటు నర్సాపురం తదితర ప్రాంతాల్లో సీబీఐ అధికారులు ఏకకాలంలో తనఖీలు నిర్వహించారు.

వివాదాస్పద ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు చెందిన భవనంలోనే రఘురామకృష్ణంరాజు నివసిస్తున్నారు. ఎమ్మార్ కేసులో ఐఏఎస్ అధికారి, ప్రస్తుత ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంపై నమోదైన ఛార్జీషీటును హైకోర్టు కొట్టివేసింది.

అయితే ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం సమయంలో ఎల్వీ సుబ్రమణ్యం ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే సీబీఐ దాడులు జరిపినట్లు సమాచారం.