వాసిరెడ్డి ప్రశ్నకు టిడిపి బదులిస్తుందా ?

వాసిరెడ్డి ప్రశ్నకు టిడిపి బదులిస్తుందా ?

వైసిపి నేత వాసిరెడ్డి పద్మ టిడిపిపై నిప్పులు చెరిగారు. ‘ఎల్లో మీడియా కథనాలకు ఆధారాలు ఉన్నాయా’ అని సూటిగా ప్రశ్నించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, జగన్ విచారణకు సంబంధించి అక్రమార్కుల జాబితాలో జగన్ పదో స్ధానంలో ఉన్నారంటూ పచ్చ పత్రికల్లో వచ్చిన కథనాన్ని పద్మ ఎత్తిచూపారు. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈడీ దర్యాప్తు పేరుతో వైఎస్‌ జగన్‌పై చంద్రబాబునాయుడు ఎల్లో మీడియా ద్వారా అసత్య కథనాలు ప్రచారం చేయిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇంగ్లీషు పత్రిక కథనాన్ని ఆధారంగా అని చెప్పుంటూ పచ్చ పత్రికల్లో జగన్ కు వ్యతిరేక వార్తలు ఎలా రాస్తాయని నిలదీశారు.

వైఎస్‌ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూడలేకే చంద్రబాబు ఇలాంటి చవకబారు ఎత్తుగడలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే టీడీపీ కుయుక్తులు పన్నుతోందన్నారు. అసత్య కథనాలను పట్టుకుని చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. మొన్న పనామా పేపర్లన్నారు, నిన్న ప్యాడైజ్‌ పత్రాల్లో జగన్ పేరన్నారు, ఈరోజు ఈడి దర్యాప్తంటూ కొత్త కథనాన్ని అచ్చేయిస్తున్నట్లు దులిపేసారు. సరే, ప్యారడైజ్ పేపర్లో తన పేరుందన్న విషయంలో చంద్రబాబుకు జగన్ సూటిగా సవాలు విసిరినా ఎవరూ స్పందించలేదనుకోండి అది వేరే సంగతి.

ప్రజాసంకల్పయాత్రలో పాల్గొంటున్న జనాలను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నట్లు ఎద్దేవా చేశారు. ఎన్నికుట్రలు చేసినా జగన్‌కు ప్రజాదరణ తగ్గదని అన్నారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు జనం నీరాజనాలు పడుతున్నారని తెలిపారు. జగన్‌ పాదయాత్రకు జనం వేలాదిగా వచ్చి సమస్యలు చెప్పకుంటున్నారని బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని చెప్పారు. టీడీపీ నేతలకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos