Asianet News TeluguAsianet News Telugu

జమ్మూలో రాష్ట్రపతి పాలన విధించండి: ఒమర్ అబ్దుల్లా

జమ్మూ కాశ్మీర్ లో రాష్ట్రపతి పాలనకు ఒమర్ అబ్ధుల్లా డిమాండ్

Will not form government with any party, support Governor rule in J&K: Omar Abdullah

శ్రీనగర్:జమ్మూ కాశ్మీర్  రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించాలని నేషనల్ కాన్పరెన్స్  నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా  డిమాండ్ చేశారు. కాశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ  రాజీనామా చేసిన వెంటనే  ఒమర్ అబ్దుల్లా  గవర్నర్ ను మంగళవారం నాడు కలిశారు. 

గవర్నర్ ను కలిసిన తర్వాత  ఆయన మీడియాతో మాట్లాడారు.  రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీకి కూడ మెజార్టీ లేదన్నారు.  గవర్నర్ ను కలిసి కూడ ఇదే విషయాన్ని చెప్పినట్టు ఆయన చెప్పారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని తాము కోరినట్టు చెప్పారు.ఎన్నికలు నిర్వహిస్తే  ప్రజలు  ఏ పార్టీని  కోరుకొంటారో ఆ పార్టీకి పట్టం కడతారని ఆయన చెప్పారు.


  శాంతి భద్రతల విషయంలో పీడీపీకి ఎంత బాధ్యత ఉందో, బిజెపికి కూడ అంతే బాధ్యత ఉందన్నారు.  పీడీపీ  ప్రభుత్వానికి బిజెపి మద్దతు ఉప సంహరిస్తుందని తాము ముందే ఊహించినట్టుగా ఆయన చెప్పారు.  తాము ఏ పార్టీకి మద్దతును ఇవ్వబోమని చెప్పారు.  ఏ పార్టీ మద్దతును కోరబోమని ఆయన చెప్పారు. కాశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోమన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios