క్షమాపణ చెప్పాల్సి వస్తే పార్టీకి రాజీనామా చేస్తానన్న మాటకు ఎంపి కట్టుబడి ఉంటారా? లేక ఒత్తిడికి లొంగి క్షమాపణ చెప్పుకుని వివాదాన్ని సర్దబాటు చేసుకుంటారా అన్నది చూడాలి. ఎందుకంటే, మూడు రోజుల క్రితం హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళటానికి విమానం ఎక్కేందుకు జెసి విమానాశ్రయంకు రాగా విమాన సిబ్బంది బోర్డింగ్ పాస్ ఇవ్వటానికి నిరాకరించారు. అందరి ముందు జరిగిన ఆ ఘటన ఎంపి అహంపై పెద్ద దెబ్బే కొట్టింది.

చంద్రబాబునాయుడు మాటను అనంతపురం టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి వింటారా? అనుమనమే? ఎందుకంటే, జెసి వ్యక్తిత్వమే అటువంటిది. తన మాట చెల్లుబాటు కాదనుకున్నపుడు వెంటనే జెసి చేసేదేంటంటే తిరుగుబాటు లేవదీయటం. జెసి చరిత్రను చూస్తే ఎవరికైనా అర్ధమైపోతుంది. ఇంతకీ చంద్రబాబు మాటలను జెసి వినాల్సింది ఏ విషయంలో అంటారా?

అదేనండి, జెసిపై ఉన్న ట్రావెల్ బ్యాన్ విషయంలోనే. విశాఖపట్నంలో బోర్డింగ్ పాస్ విషయంలో జెసి దివాకర్ రెడ్డి విమాన సిబ్బందిపై వీరంగం చేసిన విషయం గుర్తింది కదా? దాని తర్వాత దేశీయంగా కొన్ని విమాన సంస్ధలు తమ విమానాల్లో జెసి ప్రయాణించకుండా బ్యాన్ పెట్టాయి. ఆ విషయంపైనే జెసితో చంద్రబాబు మాట్లాడుతూ, ట్రావెల్ బ్యాన్ వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు.

తాను తప్పు చేసిన విషయం జెసికి బాగా తెలుసు. అయితే, ఆ విషయాన్ని ఒప్పుకోవటానికి ఆయనకు అహం అడ్డువస్తోంది. సమస్య అంతా ఇక్కడే వస్తోంది. తాను తప్పు చేయలేదని, ఎవరికీ క్షమాపణ చెప్పే ప్రశక్తే లేదని జెసి తెగేసి చెబుతున్నారు. అవసరమైతే పార్టీకి రాజీనామా చేస్తానే గానీ ఎవరికీ క్షమాపణ మాత్రం చెప్పనంటూ ఇటీవలే ‘రిపబ్లిక్’ టివి జరిపిన స్టింగ్ ఆపరేషన్లో చెప్పిన సంగతి అందరూ చూసిందే.

క్షమాపణ చెప్పాల్సి వస్తే పార్టీకి రాజీనామా చేస్తానన్న మాటకు ఎంపి కట్టుబడి ఉంటారా? లేక ఒత్తిడికి లొంగి క్షమాపణ చెప్పుకుని వివాదాన్ని సర్దబాటు చేసుకుంటారా అన్నది చూడాలి. ఎందుకంటే, మూడు రోజుల క్రితం హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళటానికి విమానం ఎక్కేందుకు జెసి విమానాశ్రయంకు రాగా విమాన సిబ్బంది బోర్డింగ్ పాస్ ఇవ్వటానికి నిరాకరించారు. అందరి ముందు జరిగిన ఆ ఘటన ఎంపి అహంపై పెద్ద దెబ్బే కొట్టింది. ఆ విషయం చంద్రబాబు దృష్టికీ చేరింది. దాంతో సోమవారం తనను కలసిన జెసితో చంద్రబాబు వివాదాన్ని సర్దుబాటు చేసుకోమని సూచించారు. మరి జెసి ఏం చేస్తారో చూడాలి.