వివిధ మంత్రిత్వశాఖల మధ్య తిరిగిన డ్రాఫ్ట్ చివరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి చేరింది కూడా వాస్తవమే. అయితే, ఎక్కడో వ్యవహారం లీకయ్యింది. వెంటనే ఉద్యోగుల్లో అలజడి మొదలైంది. దాంతో ప్రభుత్వానికి ఏం చేయాలో అర్ధంకాలేదు.
ప్రభుత్వ పరిస్ధితి తేలుకుట్టిన దొంగలాగ అయిపోయింది. ఉద్యోగులను 50 ఏళ్లకే బలవంతంగా ఉద్యోగ విరమణ చేయించేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేసిందన్నది వాస్తవం. అందుకు తగ్గట్లుగా డ్రాఫ్ట్ ఫైల్ కూడా సర్కులేట్ అయ్యింది. వివిధ మంత్రిత్వశాఖల మధ్య తిరిగిన డ్రాఫ్ట్ చివరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి చేరింది కూడా వాస్తవమే. అయితే, ఎక్కడో వ్యవహారం లీకయ్యింది. వెంటనే ఉద్యోగుల్లో అలజడి మొదలైంది. దాంతో ప్రభుత్వానికి ఏం చేయాలో అర్ధంకాలేదు.
గడచిన మూడు రోజులుగా ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతల ప్రతిస్పందన చూస్తుంటేనే ప్రభుత్వం సిద్ధం చేసిన డ్రాఫ్ట్ విషయంలో ఎంతగా ఆందోళన చెందుతున్నారో అర్ధమైపోతుంది. చంద్రబాబునాయుడు నుండి మంత్రుల వరకూ ప్రతీ ఒక్కళ్ళూ అబద్దాలే చెప్పారు. ఉద్యోగులను బలవంతంగా ఉద్యోగ విరమణ చేయించాలన్న ఆలోచనే ప్రభుత్వానికి లేదంటూ బుకాయించారు. సిద్దమైన డ్రాఫ్ట్ కాపీలు బయటకు వచ్చేసిన తర్వాత కూడా ఇంకా బొంకుతున్నారంటేనే ప్రభుత్వం ఎంతగా అబద్దాలు చెబుతున్నదో అందరికీ అర్ధమైపోతోంది.
ఎంతసేపూ జీవోలేవీ సిద్దం కాలేదని దబాయిస్తున్నారే కానీ డ్రాఫ్ట్ సిద్దమైన విషయాన్ని మాత్రం అంగీకరించలేదు. చివరకు డ్రాఫ్ట్ కాపీలను చూపితే అప్పుడు మంత్రులు నోరుమూసుకున్నారు. దాంతో ఉద్యోగుల మెడపై ప్రభుత్వం కత్తిపెట్టాలనుకున్న విషయం వాస్తవమేనని రుజువైపోయింది. మామూలుగా అయితే, ప్రభుత్వ చర్యలపై ఉద్యోగ సంఘాలు ఈ పాటికే రోడ్లపైకి రావాలి. కానీ కొందరు నేతల కారణంగానే ఇంకా విషయం చేతులుదాటి పోలేదు.
సిద్దమైన డ్రాఫ్ట్ ను రద్దు చేస్తుందా లేక అమలు చేయటానికే సిద్ధపడుతుందా అన్న విషయం చెప్పలేదు. అయితే, డ్రాఫ్ట్ సిద్దమైన విషయం ఎలా లీకైందని మాత్రం ఇపుడు ఆరాలు తీస్తోంది. అంటే ఎవరైతే విషయాన్ని లీక్ చేసారో వాళ్ళపై చర్యలు తీసుకునేందకు నిర్ణయించిందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టిడిపి ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్నా ఉద్యోగులకు సమస్యే. ఈ విషయం గతంలో ఎన్నోమార్లు రుజువైంది. అయినా, సాధారణ ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న నేపధ్యంలో ఉద్యోగులందరినీ దూరం చేసుకునేట్లు ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తోందో అర్ధం కావటం లేదు.
