Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తారేమో...? 

ఈసారి లోక్ సభ ఎన్నికల ఫలితాలు చాలా ఆసక్తికరంగా వున్నాయి. ఇటు బిజెపి నేతృత్వంలోని ఎన్డిఏ కూటమి అయినా, అటు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి అయినా చంద్రబాబు సపోర్ట్ లేకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేని పరిస్థితి. మరి చంద్రబాబు మనసులో ఏముందంటే...

Will Chandrababu make Rahul Gandhi the Prime Minister? AKP
Author
First Published Jun 5, 2024, 11:26 AM IST

హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి కూటమి బంపర్ మెజారిటీతో విజయం సాధించింది. టిడిపి చరిత్రలోనే కనీవిని ఎరగని విక్టరీ ఇది... వైసిపికి ప్రతిపక్షహోదా కూడా దక్కకుండా మట్టికరిపించారు. ఇదే సమయంలో అత్యధిక ఎంపీ సీట్లను సాధించిన టిడిపి కేంద్రంలోనూ కీ రోల్ పోషించనుంది. బిజెపి మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోయింది... కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు టిడిపి మద్దతు తప్పనిసరి. అటు ఎన్డిఏ, ఇటు ఇండి కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలున్నాయి... కాబట్టి చంద్రబాబు ఎటువైపు నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.   

ఎన్నికల విజయం తర్వాత టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కూటమి గెలుపులో బిజెపి పాత్ర వుందంటూనే ఎన్డిఏకు మద్దతుపై సస్పెన్స్ కొనసాగించారు. ఇవాళ ఎన్డిఏ భాగస్వామ్య పార్టీల సమావేశం కోసం డిల్లీకి వెళుతున్నానని... ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటానని అన్నారు. భవిష్యత్ లో ఏదయినా జరగొచ్చు అనేలా చంద్రబాబు చేసిన కామెంట్స్ బిజెపిని కంగారు పెడితే... కాంగ్రెస్ కు ఆశలు పెంచాయి.  

కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో టిడిపి ఎంపీలు కీలకం. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలకోసం చంద్రబాబు ఎన్డిఏ నుండి బయటకు వచ్చినా ఆశ్చర్యం లేదనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే దేశ రాజకీయాల్లో పెను సంచలనాలు చోటుచేసుకోనున్నాయి. చంద్రబాబుతో పాటు నితీశ్ కుమార్ కూడా ఎన్డిఏను వీడి ఇండి కూటమిలో చేరితో మోదీ హ్యాట్రిక్ కల చెదిరిపోవడం ఖాయం. ఇదే సమయంలో రాహుల్ గాంధీ ప్రధాని కల నెరవేరుతుంది.  

రాహుల్ కు ప్రధాని అవకాశాలు...:  

ఈ లోక్ సభ ఎన్నికల్లో ఇండి కూటమి ఎవరూ ఊహించన స్థాయిలో ఓట్లు సీట్లు సాధించింది. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా, బిజెపి హవాను తట్టుకుని ఇండి కూటమి ఏకంగా 234 సీట్లు సాధించింది. అంటే అధికారానికి కొన్నిసీట్ల దూరంలో మాత్రమే నిలిచింది. అయితే తన పాత మిత్రులు టిడిపి, జెడి(యు) కలుపుకుపోతే ఆ గ్యాప్ ను భర్తీ చేసుకుని కాంగ్రెస్ కూటమి అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశాలున్నాయి.  

ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన చంద్రబాబు నాయుడు, బిహార్ కు చెందిన నితీశ్ కుమార్ ను తమవైపు తిప్పుకోగలిగితే చాలు... రాహుల్ గాంధీ ప్రధాని కల నెరవేరుతుంది. అయితే ఇలా జరగడం కష్టమే... కానీ అసాధ్యమేమీ కాదు. ఈ రెండు పార్టీలు గతంలో కాంగ్రెస్ తో కలిసి పనిచేసినవే. అయితే పాత మిత్రులను దగ్గరకు తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని కాంగ్రెస్ కూడా ప్రయత్నిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ చంద్రబాబు ఎన్డిఏ నుండి బయటకు వచ్చి ఇండి కూటమిలో చేరితే రాజకీయ సమీకరణలన్ని వేగంగా మారిపోతాయి.  

ప్రస్తతం ఎన్డిఏకు 292 సీట్లుంటే, ఇండి కూటమికి 234 సీట్లు వచ్చాయి. ఎన్డిఏకు నేతృత్వం వహిస్తున్న బిజెపి 241 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచింది... కానీ సొంతంగా మేజిక్ ఫిగర్ ను సాధించలేకపోయింది... దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డిఏ మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వస్తోంది. అయితే ఎన్డిఏలో బిజెపి తర్వాత టిడిపికే అత్యధిక స్థానాలున్నాయి. 16 ఎంపీ సీట్లు సాధించిన టిడిపి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటుచేసేది ఎన్డిఏనా... ఇండి కూటమా అన్నది డిసైడ్ చేయనుంది. 

చంద్రబాబుపైనే అందరి చూపు : 

ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు ఎన్డిఏలో చేరారు.  ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపికి పెద్దగా బలం లేకున్నావైసిపి ఓడించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలి... కాబట్టి జనసేన సహకారంతో బిజెపితో మంతనాలు జరిపారు. బిజెపి అధినాయకత్వం అంగీకరించడంతో టిడిపి ఎన్డిఏలో  చేరింది.  

అయితే ఎన్నికలు ముగిసాయి... ఫలితాలు వెలువడ్డాయి... మరి ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. వదేశంలో తిరిగి ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడాలంటే టిడిపి మద్దతు తప్పనిసరి. దీంతో చంద్రబాబు ఏం చేస్తారోనని యావత్ దేశం ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios