బిజెపి మంత్రులు రాజీనామాలు చేస్తారా?

బిజెపి మంత్రులు రాజీనామాలు చేస్తారా?

చంద్రబాబునాయుడు మంత్రివర్గం నుండి బిజెపి మత్రులు కూడా తప్పుకోనున్నారా? జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఏపి ప్రయోజనాల విషయంలో కేంద్ర అనుసరిస్తున్న వైఖిరికి నిరసనగా కేంద్రం నుండి టిడిపి మంత్రులు రాజీనామాలు చేస్తారని బుధవారం రాత్రి చంద్రబాబు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే టిడిపి కేంద్రమంత్రుల రాజీనామాలపై చంద్రబాబు ప్రకటించారో బిజెపి నేతలు విజయవాడలో అత్యవసర సమావేశమయ్యారు.

చంద్రబాబు చేసిన ప్రకటన పర్యవసానాలపై చర్చించారు. మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఎంఎల్సీలు సోమువీర్రాజు, మాధవ్, ఎంఎల్ఏ ఆకుల సత్యనారాయణ పాల్గొన్నారు. మరో మంత్రి కామినేని శ్రీనివాసరావు సమావేశానికి హాజరుకాలేదు. అత్యవసర సమావేశంలో చంద్రబాబు మంత్రివర్గం నుండి బిజెపికి చెందిన ఇద్దరు మంత్రులు రాజీనామాలు చేయాలని డిసైడ్ చేశారు.

అయితే అందుకు కొంత వ్యవధి తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎందుకంటే, కేంద్రంలో టిడిపి మంత్రుల రాజీనామాలు చేసిన తర్వాతే రాష్ట్రంలో బిజెపి మంత్రుల రాజీనామాలు చేసే అవకాశాలున్నాయి. అంటే కేంద్రంలో టిడిపి మంత్రుల రాజీనామాలు ఉపసంహరించుకునే అవకాశాలున్నాయని బిజెపి నేతలు అంచనా వేస్తున్నట్లు కనబడుతోంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos