తిరుపతి: ఢిల్లీ నుంచి భార్యతో వచ్చి ఓ వ్యక్తి హోటల్లో శవమైన తేలాడు. తిరుపతిలోని ఓ హోటల్లో మంగళవారం తెల్లవారు జామున ఈ సంఘటన జరిగింది. నాలుగు రోజుల క్రితం దంపతులు తిరుపతి వచ్చి హోటల్లో దిగారు.

శ్రీవారి దర్శనం కోసం వచ్చామని చెప్పి వారిద్దరు హోటల్లో దిగారు. భార్య మంగళవారం తెల్లవారు జామున మూడున్నర గంటల ప్రాంతంలో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. అయితే, గది ఖాళీ చేసి వెళ్లిపోయారని హోటల్ సిబ్బంది చెబుతున్నారు. 

మృతుడిని సుభాష్ కుమార్ గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు వచ్చే సరికి సుభాష్ కుమార్ శవం మంచంపై పడి ఉంది. గది నిండా రక్తం ఉంది.

భార్యనే సుభాష్ కుమార్ ను హతమార్చి ఉంటుందని పోలీసులు అనుమానిస్తన్నారు. దర్యాప్తు చేపట్టారు. గది నుంచి పోలీసులు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.