విజయవాడ: కృష్ణా జిల్లాలోని చందర్లపాడు మండలం మునగాలపల్లిలో దారుణ హత్య జరిగింది.  వేధింపులు భరించలేక ఓ వ్యక్తిని అతని భార్యే చంపేసింది. మునగాలపల్లి గ్రామానికి చెందిన పిడతల సురేష్ మద్యానికి బానిసయ్యాడు. 

చిత్తుగా తాగుతూ అతను భార్యను ప్రతి రోజూ వేధించసాగాడు. దీంతో విసిగిపోయిన అతని భార్య ఇనుపరాడ్డుతో సురేష్ తలపై గట్టిగా కొట్టింది. దాంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. 

విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. సురేష్ భార్యను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.