లవర్‌తో రాసలీలలు: భర్తను హత్య చేసిన భార్య

Wife kills her husband with the help of lover in Prakasham district
Highlights

భర్త, పిల్లల ముందే లవర్ తో ఎంజాయ్

ఒంగోలు: ప్రియుడితో కలిసి ఓ భార్య తన భర్తను హత్య చేసింది. వివాహేతర  సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంగా అతడిని అడ్డుతొలగించుకొనేందుకే  ఆమె ఈ దారుణానికి పాల్పడింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకొంది. 


ప్రకాశం జిల్లా దర్శికి చెందిన వివాహిత తన భర్త ఖాశీం వలీని ప్రియుడి సహాయంతో గొంతు నులిమి చంపేసింది. జూన్ 13వ తేదిన రాత్రి పూట భర్తను హత్య చేయాలని ప్రియుడిని ఇంటికి పిలిపించుకొంది. జూన్ 14వ తేది తెల్లవారుజామున భర్తను హత్య చేసింది. ఉదయమే తన భర్త చనిపోయాడని నటించింది. 

ఖాశీం వలీ భార్యకు  రమణయ్యకు వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం ఖాసీంవలీకి తెలిసింది.  దీంతో భార్యను అతను నిలదీశాడు. పద్దతిని మార్చుకోవాలని కూడ ఆయన పలు మార్లు భార్యను హెచ్చరించారు. కానీ, ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. అయితే ఖాశీంవలీ  లారీ డ్రైవర్ గా పనిచేసేవాడు. దీంతో నెలలో ఎక్కువ రోజులు ఇంటికి దూరంగా ఉండేవాడు.

భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె ప్రియుడితో గడిపేది.భర్త లేని సమయంలో ప్రియుడి నేరుగా ఆమె ఇంటికి వచ్చేవాడు. అయితే భర్త, పిల్లలు ఇంట్లో ఉన్న సమయంలో కూడ ప్రియుడు ఇంటికి వచ్చిపోయేవాడు. ఈ విషయమై బంధువులు, కుటుంబసభ్యులు పలుమార్లు హెచ్చరించినా కానీ , ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేయాలని ప్లాన్ చేసింది.

జూన్ 13వ తేదిన విధులు ముగించుకొని భర్త ఇంటికి వచ్చాడు. కూతురును రంజాన్ మాసం సందర్భంగా రాత్రి పూట ప్రార్ధనలకు మసీదు వద్దకు పంపింది. ఇంటికి వచ్చిన కూతురుకు తండ్రి ఆరోగ్యం బాగాలేదని ఇంట్లోకి రాకూడదని పక్కింట్లో బలవంతంగా పడుకోబెట్టింది. ప్రియుడు రమణయ్యను అదే రోజు రాత్రిపూట ఇంటికి పిలిపించుకొంది. 

నిద్రలో ఉన్న ఖాశీంవలీని గొంతుకు వైరు బిగించి హత్య చేశారు. ప్రియుడికి భార్య కూడ సహకరించింది. భర్త చనిపోయాడని నిర్ధారించుకొన్న తర్వాత  తెల్లవారుజామున ప్రియుడిని ఇంటి నుండి పంపించింది. ఉదయమే ఏమీ తెలియనట్టుగానే తన భర్త మరణించాడని వివాహిత డ్రామా ఆడింది..

అయితే ఖాశీం వలీ మృతికి భార్యే కారణమని భావించిన  స్థానికులు ఆమెను నిలదీశారు. అయితే ఈ విషయమై నిజమేనని చెప్పింది. తానే భర్తను చంపేశానని ఆమె చెప్పింది.నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఖాశీంవలీ పేరున ఉన్న ఆస్తిని  పిల్లల పేరున రాయాలని  కుటుంబసభ్యులు కోరుతున్నారు. 


 

loader