ఒంగోలు: ప్రకాశం జిల్లా పంగులూరులో ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. వివాహేతర సంబంధం కారణంగా. భార్యాభర్తలు మృతి చెందడంతో పిల్లలు అనాధలుగా మిగిలారు. ప్రకాశం జిల్లా జె. పంగులూరు మండలం చందలూరు బీసీ కాలనీకి చెందిన  జి. వేణు, ధనలక్ష్మిలు భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. 

అద్దంకి ఎన్టీఆర్ నగర్‌లో ఉంటూ వీరు జీవనం సాగిస్తున్నారు. వేణుకు చీమకుర్తి మండలం రాయుడుపాలెం గ్రామానికి చెందిన  ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది.

 వివాహేతర సంబంధం కారణంగా రెండు కుటుంబాల మధ్య తరచూ గొడవలు జరిగేవి. వేణుతో వివాహేతర సంబంధం పెట్టుకొన్న మహిళ హైద్రాబాద్‌లో మకాం ఏర్పాటు చేసింది.  ఇటీవలే ఆమె అద్దంకికి వచ్చింది.

వేణుతో కలిసి అతడి బైక్‌పై ఆ మహిళ నాయుడుపాలెం వెళ్లింది. ఈ విషయం తెలిసిన వేణు ఇంటికి తిరుగుప్రయాణమయ్యాడు.అయితే మార్గమధ్యలో వేణుతో వివాహేతర సంబంధం ఉన్న మహిళ గుండ్లకమ్మ వంతెనపై నుండి నదిలో దూకింది.  నీళ్లలో మునిగిపోతున్న ఆమెను కాపాడే క్రమంలో వేణు నీళ్లలో మునిగిపోయాడు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ధనలక్ష్మి బుధవారం నాడు మృతి చెందింది. వేణుతో పాటు ఆయన భార్య ధనలక్ష్మి కూడ మృతి చెందడంతో   పిల్లలు అనాధలుగా మారారు.