(వీడియో) ప్రియురాలి ఇంట్లోనే భర్తను తాళం వేసేసిన భార్య

wife catches husband with paramour red handed and lock up the house
Highlights

  • వేరే మహిళతో భర్తకు  సంబంధం ఉందని తెలుసుకున్న ఓ భార్య వారిద్దరూ ఇంట్లో ఉన్నపుడు బయటనుండి తాళమేసేసింది.
  • చుట్టుపక్కల వారంవరినీ పిలిచి మరీ పంచాయితీ పెట్టింది.

వేరే మహిళతో భర్తకు  సంబంధం ఉందని తెలుసుకున్న ఓ భార్య వారిద్దరూ ఇంట్లో ఉన్నపుడు బయటనుండి తాళమేసేసింది. చుట్టుపక్కల వారంవరినీ పిలిచి మరీ పంచాయితీ పెట్టింది. అంతేకాకుండా ఆ ఇంటి ముందే తనకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు కూడా దిగింది. ఇంతకీ విషయమేంటంటే, ప్రసాద్ విశాఖపట్నం జిల్లా గాజువాకలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. 2014లో దుర్గతో వివాహమైంది. జిల్లాలోని ఆరిలోవా అనే ఊరిలో కాపుముంటున్నారు.

కొతకాలంగా భర్త ప్రవర్తనలో భార్యకు అనుమానం వచ్చింది. మెల్లిగా ఆరా తీసింది. పురుషోత్తమపట్నం అనే ఊరిలో తన భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకుంది. వెంటనే అక్కడికి వెళ్ళింది. వేరే మహిళ ఇంట్లో ఉన్న తన భర్తను చూసింది. వెంటనే ఇంటికి తాళం వేసేసింది. చివరకు అదే ఇంటి ముందు కూర్చుని ఆందోళన చేస్తోంది న్యాయం కోసం.

loader