జాతీయ స్ధాయిలో క్రేజ్ ఎందుకో తెలుసా ?
జాతీయస్ధాయిలో జగన్మోహన్ రెడ్డి క్రేజ్ పెరుగుతోంది. అందుకు కారణాలేంటో తెలుసా? ప్రముఖ దినపత్రికి నిర్వహించిన సర్వేలో పలు ఆశక్తకరమైన అంశాలు వెలుగుచూశాయి.
రాష్ట్రానికి సంబంధించి అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 స్ధానం అందుకున్నారు. నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడున్నపుడు జగన్ కు మొదటిస్ధానం ఎలా వస్తుంది? అంటే ప్రముఖ ఇంగ్లీషు దినపత్రిక చేసిన సర్వేలో అదే నిజమని తేలింది. దేశంమొత్తం మీద అత్యంత శక్తిమంతులైన జాబితా కోసం దినపత్రిక సర్వే చేసింది లేండి.
సహజంగానే ప్రధానమంత్రి నరేంద్రమోడికి మొదటిస్ధానం దక్కింది. అదే తెలుగురాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తుల్లో జగన్ దే మొదటిస్ధానం. అంటే దేశవ్యాప్తంగా జగన్ కు 35వ స్ధానం దక్కింది. చంద్రబాబుకు 36వ స్ధానం దక్కటం గమనార్హం.
అప్పట్లో అత్యత శక్తమంతమైన సోనియాగాంధిని ఎదుర్కొని కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేయటం, చంద్రబాబును ఎదుర్కొంటున్న తీరు, తాజాగా మోడి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టటం లాంటి అంశాలతో జాతీయ స్ధాయిలో పలువురు దృష్టిని జగన్ ఆకర్షించారట.
అదే సమయంలో చంద్రబాబుకు గట్టి ప్రత్యామ్నాయంగా జగన్నే పలువురు అభిప్రాయపడుతున్నట్లు సర్వేలో తేలింది. చంద్రబాబు సామాజికవర్గానికి వ్యతిరేకంగా ముస్లింలు, బిసిలను ఏకం చేసేందుకు జగన్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా దినపత్రిక అభిప్రాయపడింది. ఏదేమైనా మోడి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపట్టటంతో జగన్ కు జాతీయ స్ధాయిలో మంచి క్రేజ్ వచ్చినట్లైంది.