వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రికి పెద్ద తలనొప్పిగా తయారైనట్లున్నారు. ఎందుకంటే, అవసరం ఉన్నా లేకపోయినా ప్రతీ విషయంలోనూ విజయసాయిని చంద్రబాబునాయుడు పిక్చర్ లోకి తీసుకొస్తున్నారు. ప్రతీ చిన్న విషయంలోను వైసిపి ఎంపిని చూసి చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారు. అసెంబ్లీ సమావేశంలో కూడా విజయసాయి గురించే మాట్లాడారంటేనే అర్ధమవుతోంది చంద్రబాబు ఎంతలా ఉలిక్కిపడుతున్నారో?

ఒక్క చంద్రబాబే కాదు మొత్తం టిడిపి నేతలంతా కూడా విజయసాయినే టార్గెట్ గా పెట్టుకున్నట్లు కనబడుతోంది. జగన్ తరపున విజయసాయి ఢిల్లీ స్ధాయిలో లాబీయింగ్ చేస్తున్నారంటే అది ఆయన సామర్ధ్యానికి నిదర్శనం. ప్రధాని అపాయిట్మంట్ సంపాదించగలుగుతున్నా,  అమిత్ షా తో మాట్లాడగలుతున్నా, రామ్ నాధ్ కోవింద్ ను అందరికంటే ముందుగా కలిసి అభినందనలు తెలిపినా అది ఎంపి లాబీయింగ్ కు నిదర్శనమే అనటంలో సందేహం లేదు.

ఢిల్లీలో జగన్ తరపున విజయసాయి ఒక్కడే ఇన్ని  పనులు చేయగలుగుతున్నపుడు మరి, చంద్రబాబు తరపున ఎంతమంది ఇంకెన్ని పనులు చేస్తుండాలి? కేంద్రమంత్రి వర్గంలో ఇద్దరు మంత్రులు, లోక్ సభ, రాజ్యసభ ఎంపిలు, ఏపి ప్రత్యేక ప్రతినిధులు ఇంతమంది ఏం చేస్తున్నట్లు?

ఇంతమందిలో ఒక్కళ్ళు కూడా చంద్రబాబు తరపున ప్రధాని అపాయిట్మెంట్ సాధించలేకపోయారు. అమిత్ షా తో మాట్లాడలేకపోయారు. రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరో కూడా ముందుగా కనుక్కోలేకపోయరంటే అది కచ్చితంగా చంద్రబాబు వైఫల్యమే. ఎనీ డౌట్?