తాము ప్రతిపక్షంలో ఉన్నపుడు, పోయిన ఎన్నికల సమయంలో జగన్ పై వేయించిన కార్టూన్లను, వ్యంగ్యాస్త్రాలను చంద్రబాబు మరచిపోయినట్లున్నారు. ఇపుడు కూడా టిడిపి అధికారిక వెబ్ సైట్లో, జగన్ పై కార్టూన్లు వస్తున్న విషయాన్ని చంద్రబాబు, లోకేష్ కు తెలీకుండానే ఉంటుందా? 

అరెస్టు చేయాల్సిన వాళ్ళ జాబితాను చంద్రబాబునాయుడు సర్కార్ సిద్ధం చేసుకున్నట్లే ఉంది. మొన్న ఇంటూరి రవికిరణ్ అరెస్టు చేసిన ప్రభుత్వం తాజాగా ఇప్పాల రవీంద్రను కూడా అరెస్టు చేసింది. రేపు ఎవరిని అరెస్టు చేస్తుందనే విషయంలో చర్చ మొదలైంది. ఎంతమందిని అరెస్టు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నదో ఎవరికీ అర్ధం కావటం లేదు. రవికిరణ్ అరెస్టుకు ముందు కాస్త పద్దతిని పాటించిన సర్కార్ రవీంద్ర అరెస్టుకు వచ్చేసరికి అసలు ఏ విధమైన పద్దతీ పాటించకపోవటం గమనార్హం.

ఇంతకీ ఇపుడు రవీంద్రను ఎందుకు అరెస్టు చేసిందట ప్రభుత్వం. ప్రభుత్వంపై వ్యంగ్యంగా కార్టూన్లు వేస్తున్నందుకట. ఎంత విచిత్రంగా ఉందో ప్రభుత్వ వాదన. ప్రభుత్వం అన్నాక అందరూ మద్దతు ఇచ్చే వాళ్ళే ఉంటారా సమాజంలో? తమను ఎవరూ వ్యతిరేకించకూడదని, ఒకవేళ వ్యతిరేకించే వాళ్ళున్నా అన్నీ మూసుకుని కూర్చోవాలే తప్ప కార్టూన్లు వేయకూడదని, వ్యంగ్యంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదన్నది చంద్రన్న సిద్ధాంతంగా కనబడుతోంది.

తాము ప్రతిపక్షంలో ఉన్నపుడు, పోయిన ఎన్నికల సమయంలో జగన్ పై వేయించిన కార్టూన్లను, వ్యంగ్యాస్త్రాలను చంద్రబాబు మరచిపోయినట్లున్నారు. ఇపుడు కూడా టిడిపి అధికారిక వెబ్ సైట్లో, జగన్ పై కార్టూన్లు వస్తున్న విషయాన్ని చంద్రబాబు, లోకేష్ మరచిపోయినట్లున్నారు.

అంటే, ఇతరులపై తమెన్ని రాళ్ళు వేసిన భరించాలిం గానీ ఎదురి తిరిగి తామూ నాలుగు వేస్తామంటే కుదరదు అన్నట్లుంది వీళ్ళ పద్దతి. అధికారంలో ఉన్నారు కదా ఏం చేసినా చెల్లిపోతుందన్నట్లుంది యవ్వారం. వార్తల రూపంలో ప్రభుత్వంపై వ్యతిరేకత కనబడకుండా మీడియాను మ్యానేజ్ చేసుకోగలుగుతున్నా సోషల్ మీడియాను కంట్రోల్ చేయలేకపోతున్నామే అన్న బాధే చంద్రబాబు, లోకేష్ ను బాగా ఇబ్బంది పెడుతున్నట్లుంది.