చంద్రబాబుకు ఏమైంది ?

చంద్రబాబుకు ఏమైంది ?

చంద్రబాబునాయుడుకు ఏమైందో అర్దం కావటం లేదు. ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నారు. ముందు రోజు చెప్పిన మాటలకు విరుద్దంగా రెండో రోజు మాట్లాడుతున్నారు. తాజాగా చంద్రబాబు మాటలు చూస్తే అర్ధమైపోతోంది. శుక్రవారం కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ, ‘విభజన హామీల అమలు కోసం అవసరమైతే సుప్రింకోర్టుకైనా వెళతా’ అని స్పష్టంగా చెప్పారు. తన ప్రకటన బయటకు వచ్చిన తర్వాత తెరవెనుక ఏమైందో ఏమో శనివారం ఉదయానికల్లా మాటమార్చేశారు.

తన మాటలను వక్రీకరిచారంటూ మండిపడుతున్నారు. కోర్టుకెళతానన్న తన మాటలను వక్రీకరించటం తగదన్నారు. చంద్రబాబు మాటలను ఎవరూ వక్రీకరించలేదు. ఆయన కలెక్టర్ల సమావేశంలో అన్న మాటలనే మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది. దాంతో అప్రమత్తమైన చంద్రబాబు శనివారం మాట మార్చారు. శనివారం మధ్యాహ్నం జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో నేతలతో మాట్లాడుతూ, హామీల అమలు కోసం కోర్టును ఆశ్రయించాలని అనుకోవటం తమకున్న హక్కు అని అన్నారు.

తడవకొక మాట మాట్లాడుతుండంటతో చంద్రబాబుకు ఏమైందో నేతలకు అర్ధం కావటం లేదు. కోర్టుకు వెళతానన్న తన మాటలను భాజపాకు వ్యతిరేకంగా చేసినవి కావన్నపుడు సుప్రింకోర్టుకు ఎవరిపై వెళతారు? కేంద్రానికి వ్యతిరేకంగానే కోర్టుకు వెళ్ళినపుడు కేంద్రంలో ఉన్నది ఎవరి ప్రభుత్వం? ప్రధానమంత్రి ఎవరు? హామీలు అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిపైనుంది? కేంద్రం తమకు న్యాయం చేయకుంటే చివరి అస్త్రంగా మాత్రమే కోర్టును ఆశ్రయిస్తానని అన్నట్లు మళ్ళీ చంద్రబాబే నేతలతో అన్నారు. తాను అన్న మాటలను చంద్రబాబు అంగీకరించిన తర్వాత ఇక వక్రీకరించిందెవరు? ఏమిటో అంతా గందరగోళంగా ఉంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page