Asianet News TeluguAsianet News Telugu

నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి:టీడీపీలో చేర్చుకోవడం వెనుక బాబు ప్లాన్ ఇదే

2019 ఎన్నికలకు  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఇప్పటి నుండే  కసరత్తు చేస్తున్నాడు. రాజంపేట పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకొనేందుకు గాను పలు  సెగ్మెంట్లలో బలమైన  అభ్యర్థులను బరిలోకి దింపుతున్నాడు

why chandrababu naidu invited nallari kishore kumar reddy into tdp
Author
Chittoor, First Published Sep 13, 2018, 1:09 PM IST

చిత్తూరు: 2019 ఎన్నికలకు  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఇప్పటి నుండే  కసరత్తు చేస్తున్నాడు. రాజంపేట పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకొనేందుకు గాను పలు  సెగ్మెంట్లలో బలమైన  అభ్యర్థులను బరిలోకి దింపుతున్నాడు.మరోవైపు  ఉమ్మడి ఏపీ రాష్ట్ర చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి పీలేరు టిక్కెట్టును బాబు ఖరారు చేసినట్టు సమాచారం. 

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి  2017 నవంబర్ మాసంలో టీడీపీలో చేరారు. పీలేరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ బాధ్యతలను కూడ కిషోర్ కుమార్ రెడ్డికి చంద్రబాబునాయుడు కట్టబెట్టారు. ఈ ఏడాది జూలై 13వ తేదీన మాజీ ఏపీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అయితే తన సోదరుడు కాంగ్రెస్ పార్టీలో చేరినా.. తాను మాత్రం టీడీపీలోనే ఉంటానని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తన అనచులకు స్పష్టత ఇచ్చారు. ఇదిలా ఉంటే మూడు రోజుల క్రితం రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ముఖ్య నేతలతో చంద్రబాబునాయుడు సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి  టీడీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులకు  చంద్రబాబునాయుడు  కీలకమైన ఆదేశాలు జారీ చేసినట్టు ప్రచారం సాగుతోంది. పీలేరు నుండి కిషోర్ కుమార్ రెడ్డికి  టిక్కెట్టును ఖరారు చేసినట్టు సమాచారం. పీలేరు  నుండి వరుసగా నాలుగు ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. దీంతో నల్లారి కిషో‌ర్ కుమార్ రెడ్డి చేరికతో పార్టీకి కలిసివస్తోందా లేదా అనేది  వచ్చే ఎన్నికల్లో తేలనుంది.


మరోవైపు రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి బాబు సూచించినట్టు సమాచారం. మరోవైపు చంద్రగిరి అసెంబ్లీ సెగ్మెంట్ నుండి పులివర్తి వాసును బరిలోకి దింపాలని బాబు యోచిస్తున్నారని ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల సమయంలో  గల్లా అరుణ ఈ స్థానం నుండి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు.

ఇటీవలనే ఆమె నియోజకవర్గఇంచార్జీ పదవి నుండి తప్పుకొన్నారు.  అయితే  తమ కుటుంబంలోనే ఎవరికైనా చంద్రగిరి టిక్కెట్టును ఇవ్వాలని అరుణకుమారి కోరుతున్నారు. అయితే  పులివర్తి వాసుకు టిక్కెట్టు కేటాయిస్తారా.. గల్లా అరుణకుమారి కుటుంబానికి టిక్కెట్టు కేటాయిస్తారా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఈ వార్తలు చదవండి

అన్నకు సవాల్: నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డికి ఇంటి పోరు

కాంగ్రెస్‌లోకి కిరణ్‌కుమార్ రెడ్డి: తమ్ముడేం చేస్తారు?

Follow Us:
Download App:
  • android
  • ios