వీరిద్దరిలో టిక్కెట్టు ఎవరికి ?

వీరిద్దరిలో టిక్కెట్టు ఎవరికి ?

కర్నూలు స్ధానిక సంస్ధల ఎంఎల్సీ టిక్కెట్టు విషయాన్ని చంద్రబాబు ఎటూ నిర్ణయించలేకపోతున్నారు. పోటీ విషయంలో ఆశావహులందరూ ఎవరికి వారుగా పట్టుదలగా ఉండటంతో నిర్ణయంలో జాప్యం జరుగుతోంది. దానికితోడు ఆశావహుల్లో కూడా ప్రతీ ఒక్కరికీ బలం, బలహీనతలు ఉండటంతో అభ్యర్ధి ఎంపిక కష్టమవుతోంది. జిల్లా నేతలతో సోమవారం చంద్రబాబు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. తర్వాత విడివిడిగా కూడా మాట్లాడారు. అయినా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. కాకపోతే, ప్రతీసారి జరుగుతున్నట్లుగానే టిక్కెట్టు ఎవరికి ఇచ్చినా మిగిలిన వారంతా పనిచేసేట్లు చంద్రబాబు ఒప్పించారు. ఇది ప్రతీసారి జరిగే తంతే లేండి.

టిక్కెట్టు కోసం చాలామందే చాలా మందే ప్రయత్నాలు చేసుకుంటున్నప్పటికీ ప్రధానంగా కెఇ ప్రభాకర్, చల్లా రామకృష్ణారెడ్డి మధ్యనే  పోటీ ఉన్నట్లు సమాచారం. అయితే, వీరిద్దరి స్ధానంలో చివరి నిముషంలో నందికొట్కూరు నియోజకవర్గ ఇన్చార్జి శివనాందరెడ్డి అభ్యర్ధి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని పార్టీ వర్గాలంటున్నాయి. శివానందరెడ్డి గురించి చంద్రబాబు ఎందుకు ఆలోచిస్తున్నారు? అంటే, ఆయన వైసిపి తరపున అభ్యర్ధిగా నిలబడతారని ప్రచారంలో ఉన్న గౌరు వెంకటరెడ్డికి స్వయానా బావ అవుతారు. అందుకే బావ-బావమరుదల మధ్య పోటీ పట్టేస్తే సరిపోతుందని కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అంటే బావ, బావమరుదులే కొట్టుకోవాలన్నది చంద్రబాబు ఆలోచనేమో.

ఈరోజు సాయంత్రమే మళ్ళీ మరోసారి నేతలందరితోనూ భేటీ అవ్వాలని చంద్రబాబు నిర్ణయించటంతో అందరూ అమరావతిలోనే ఉన్నారు. బహుశా రాత్రికి అభ్యర్ధిని ప్రకటించే అవకాశాలున్నాయి. ఒకవైపు నామినేషన్ల ముగింపు తేదీ దగ్గర పడుతున్నా రెండు ప్రధాన పార్టీలు కూడా అభ్యర్ధిని ప్రకటించక పోవటం గమనార్హం.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page