Asianet News TeluguAsianet News Telugu

కూరగాయలు కొనుగోలు చేస్తుండగా తెగిపడ్డ విద్యుత్ తీగ.. వృద్ధురాలి దుర్మరణం..కర్నూలు జిల్లాలో ఘటన

ఇంటి సమీపంలో కూరగాయలు కొనుగోలు చేస్తుండగా విద్యుత్ తీగ పడి ఓ వృద్ధురాలు కరెంట్ షాక్ కు గురైంది. వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెల్లిపోయింది. కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తరలించగా.. అప్పటికే ఆమె మరణించిందని తెలిపారు. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగింది.

While buying vegetables, an electric wire was cut.. An old woman died..ISR
Author
First Published Aug 15, 2023, 6:49 AM IST

ఆ వృద్ధురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తోంది. ఆ ఇంటికి ముందు కరెంటు తీగలు వెళ్తున్నాయి. కొంత కాలం నుంచి అవి ప్రమాదకరంగా మారాయి. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ వారి నుంచి సరైన స్పందన రాలేదు. ఇక చేసేందేం లేక అలాగే ఉండిపోయారు. కానీ ఆ తీగ ఆ ఇంట్లో ఉన్న వృద్ధురాలి మరణానికి కారణమైంది. బయట ఉన్న వృద్ధురాలిపై ఒక్క సారిగా విద్యుత్ తీగ పడటంతో కరెంట్ షాక్ తో ఆమె చనిపోయింది. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగింది.

మీ ఫ్రెండ్ భర్తను పెళ్లి చేసుకున్నారా? నెటిజన్ ప్రశ్నకు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఘాటు సమాధానం

వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని లంగరబావి వీధిలోని ఓ ఇంట్లో 74 ఏళ్ల అయ్యమ్మ తన కుటుంబ సభ్యులతో నివసిస్తోంది. తన ఇంటి ఉండి కట్ట నిర్మించి ఉంది. ఆ కట్టపై కూర్చొని ఉండగా..స్థానికంగా కూరగాయలు అమ్మే వ్యక్తులు వచ్చారు. ఆ కట్టపై కూర్చొని వారి దగ్గరి నుంచి కూరగాయలు కొనుగోలు చేస్తోంది. 

ప్రైవేట్ పార్టులకు గాయాలుంటేనే రేప్ జరిగినట్టా? లేకుంటే కాదా?: ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

అయితే ఉన్నట్టుండి ఒక్క సారిగా ఆ ఇంటి సమీపం నుంచి వెళ్తున్న విద్యుత్ తీగలు ఆమెపై పడ్డాయి. దీంతో వృద్ధురాలు కరెంట్ షాక్ తగిలింది. కొంత సమయంలోనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. స్పృహతప్పి కింద పడిపోయిన అయ్యమ్మను కుటుంబ సభ్యులు గమనించారు. వెంటనే అదోని రీజినల్ ఆఫీసుకు తీసుకెళ్లారు. 

వీఐపీ సంస్కృతికి స్వస్తి.. నేతల వాహనాల్లోని సైరన్ల తొలగింపు.. అసలు కారణమేంటీ?

కానీ అప్పటికే ఆ వృద్ధురాలు మరణించిందని డాక్టర్లు ప్రకటించారు. తాము విద్యుత్ తీగలు మార్చాలని విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నో సార్లు చెప్పామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయంలో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని కాలనీ వాసులు చెప్పారు. వారి నిర్లక్ష్యం వల్లే ఒకరి ప్రాణాలు పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios