కర్నూల్: భూమా వర్గం చెల్లా చెదురు కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అఖిలప్రియపై పడింది. భూమా వర్గంలో కొందరు జగత్ విఖ్యాత్ రెడ్డిని  భూమా వర్గానికి నాయకత్వం వహించేందుకు రప్పించాలని  కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో విఖ్యాత్ రెడ్డి క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారా అనే చర్చ సర్వత్రా సాగుతోంది.

భూమా అఖిలప్రియ సోదరులు మహేష్ రెడ్డి గత మాసంలో బీజేపీలో చేరారు. భూమా వర్గాన్ని ఏకతాటిపై నడపడంతో పాటు ఈ వర్గానికి నాయకత్వం వహించేందుకు తాను  బీజేపీలో చేరినట్టుగా మహేష్ రెడ్డి ప్రకటించారు.

అయితే ఆళ్లగడ్డ, నంద్యాలలో భూమా అఖిలప్రియ, భూమా బ్రహ్మనందరెడ్డిల తరుపున ఆయన  ప్రచారం చేశారు. ఆళ్లగడ్డలో గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి విజయం సాధించడం భూమా వర్గీయులకు ఇబ్బందిగా మారింది.

ఈ తరుణంలో రాజకీయంగా తమను కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో మహేష్ బీజేపీ తీర్ధం పుచ్చుకొన్నట్టుగా చెప్పారు. ఈ తరుణంలో మహేష్ రెడ్డి వైపు భూమా వర్గం వెళ్లకుండా ఉండాలంటే భూమా నాగిరెడ్డి తనయుడు జగత్ విఖ్యాత్ రెడ్డిని బరిలోకి దింపాలని మరికొందరు కోరుతున్నారు.

భూమా వర్గం మహేష్ వైపుకు వెళ్లకుండా ఉండాలంటే క్రియాశీల రాజకీయాల్లో జగత్ విఖ్యాత్ యాక్టివ్ గా ఉండాలని కొందరు వాదిస్తున్నారు.ఒకవేళ జగత్ విఖ్యాత్ రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చేందుకు ఒప్పుకొంటే  ఆళ్లగడ్డ నుండే పోటీ చేయాల్సి ఉంటుంది.

ఆళ్లగడ్డలోనే భూమా వర్గం ఎక్కువగా ఉంది. దీంతో ఆళ్లగడ్డలోనే జగత్ విఖ్యాత్ రెడ్డి పోటీ చేయాల్సిన అనివార్య పరిస్థితులు ఉంటాయి.ఈ నియోజకవర్గం నుండి విఖ్యాత్ రెడ్డి సోదరి అఖిలప్రియ ప్రాతినిథ్యం వహించారు. 

ఒకవేళ జగత్ విఖ్యాత్ రెడ్డి పోటీకి ముందుకు వస్తే భూమా అఖిలప్రియ ఎక్కడి నుండి పోటీ చేస్తారనే చర్చ కూడ లేకపోలేదు. నంద్యాల నుండి భూమా బ్రహ్మనందరెడ్డి  ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.

2019 ఎన్నికల్లో నంద్యాల నుండి మరోసారి పోటీ చేసిన బ్రహ్మనందరెడ్డి ఓటమి పాలయ్యాడు. జగత్ విఖ్యాత్ రెడ్డి ఆళ్లగడ్డ నుండి పోటీ చేస్తే అఖిలప్రియ నంద్యాలకు వెళ్తోందా అనే చర్చ కూడ లేకపోలేదు. అఖిలప్రియ నంద్యాల నుండి పోటీ చేస్తే బ్రహ్మనంద రెడ్డి ఎక్కడి నుండి పోటీ చేస్తారనే ప్రశ్నలు కూడ లేకపోలేదు.

జగత్ విఖ్యాత్ రెడ్డి  ఆళ్లగడ్డ, నంద్యాల నుండి బ్రహ్మనంద రెడ్డి పోటీ చేస్తే అఖిలప్రియ మరో నియోజకవర్గం నుండి పోటీ చేస్తారా అనే చర్చ కూడ సాగుతోంది.అయితే ఈ విషయమై భూమా కుటుంబం నుండి మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. 


సంబంధిత వార్తలు

అఖిలప్రియకు షాక్: బీజేపీలో చేరిన సోదరులు మహేష్ , కిషో‌ర్‌ రెడ్డిలు