ముందు అమితాబ్ బచ్చన్. తర్వాత అజయ్ దేవగన్, కాజోల్ దంపతులు. ఆమధ్య పవన్ కల్యాణ్. తాజాగా పూనమ్ కౌర్. వీళ్ళ గురించి ఎందుకనుకుంటున్నారా? వీళ్ళంతా ఒక్కో రంగానికి బ్రాండ్ అంబాసిడర్లు. మొదటి ఇద్దరిని ప్రభుత్వమే నియమిస్తే, పవన్ కల్యాణ్ మాత్రం స్వయం ప్రకటిత బ్రాండ్ అంబాసిడర్. వైద్య, ఆరోగ్య శాఖ అమితాబ్ బచ్చన్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించింది. అయితే, ఆయన ఇంత వరకూ పత్తాలేరు. పర్యాటక శాఖను ప్రమోట్ చేయటానికి దంపతులను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించినట్లు ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది.
ముందు అమితాబ్ బచ్చన్. తర్వాత అజయ్ దేవగన్, కాజోల్ దంపతులు. ఆమధ్య పవన్ కల్యాణ్. తాజాగా పూనమ్ కౌర్. వీళ్ళ గురించి ఎందుకనుకుంటున్నారా? వీళ్ళంతా ఒక్కో రంగానికి బ్రాండ్ అంబాసిడర్లు. మొదటి ఇద్దరిని ప్రభుత్వమే నియమిస్తే, పవన్ కల్యాణ్ మాత్రం స్వయం ప్రకటిత బ్రాండ్ అంబాసిడర్. తాజాగా పూనమ్ ను చంద్రబాబునాయుడే బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించారు. ఇంతకీ వీళ్ళంతా బ్రాండ్ అంబాసిడర్లుగా వెలగబెట్టిందేమిటి?
అంటే ఏమీ లేదనే చెప్పాలి. వైద్య, ఆరోగ్య శాఖ అమితాబ్ బచ్చన్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించింది. అయితే, ఆయన ఇంత వరకూ పత్తాలేరు. మళ్ళీ గుజరాత్ పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్ గా మాత్రం ప్రకటనల్లో తరచూ కనబడుతూనే ఉన్నారు. తెరవెనుక ఏం జరిగిందో ఏమో? అదేవిధంగా స్టూడియో పెట్టటానికి అమరావతి పరిధిలో భూములు తీసుకోవటానికి అజయ్ దేవగన్ దంపతులు చంద్రబాబును కలిసారు ఆమధ్య.
సరే, ఇద్దరి మధ్య ఏం ఒప్పందం జరిగిందో ఏమో. వెంటనే పర్యాటక శాఖను ప్రమోట్ చేయటానికి దంపతులను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించినట్లు ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. అయితే, తర్వాత వెలుగు చూసిన పనామా పేపర్లలో దంపతుల పేర్లు ప్రకముఖంగా వినబడ్డాయి. దాంతో వాళ్ళిద్దరూ ఏపి వైపు తొంగికుడా చూడలేదు. అమితాబ్ అయినా, అజయ దేవగన్ దంపతులైనా ఏపికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారో లేదో కుడా ఎవరికీ తెలీదు.
ఆమధ్య చేనేత రంగం సమస్యలను ప్రభుత్వం దృష్టకి తెచ్చేందుకు మంగళగిరిలో ఓ బహిరంగసభ జరిగింది. సభలో పాల్గొన్న పవన్ కల్యాణ్ చేనేత రంగాన్ని తాను ఉద్ధరించేస్తానంటూ తనను తాను చేనేత రంగానికి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించేసుకున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు పవన్ ఏమి చేసారో కుడా ఎవరికీ తెలీదు. ఇక, తాజాగా సినిమాల్లో అడపా దడపా కనిపించే పూనమ్ కౌర్ ను చంద్రబాబే చేనేతరంగానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించేసారు. అంటే చేనేత రంగానికి ఇద్దరు బ్రాండ్ అంబాసిడర్లన్నమాట. పవన్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించుకున్న తర్వాత చంద్రబాబు పూనమ్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించటంలో అర్ధమేంటి?
