Asianet News TeluguAsianet News Telugu

వైసీపీ ఎంపీల రాజీనామా పొందితే.. బాబు స్టెప్ ఏంటీ..?

వైసీపీ ఎంపీల  రాజీనామా పొందితే.. బాబు స్టెప్ ఏంటీ..?

what is the intesion of chandrababu naidu after acceptence of YCP MLAs


ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా విషయంలో  కేంద్ర వైఖరిని నిరసిస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు రాజీనామా  చేసిన విషయం తెలిసిందే. స్పెషల్ స్టేటస్ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న టైంలో ఆ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు టీడీపీ, వైసీపీలు పోటీ పడ్డాయి. వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే.. అది వైరల్ అవ్వకుండా.. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత తెలుగుదేశం ఎంపీలు సభలోనే ఉండిపోయారు.. స్పీకర్ ఛాంబర్‌‌‌లో నిద్రపోయారు. ఈ సమయంలోనే వైకాపా ఎంపీలు ఏపీ భవన్ లో నిరాహార దీక్షకు దిగడం.. ఇది జనాల్లోకి బాగా వెళ్లడం జరిగింది. ఈ పరిణామాల మధ్యలోనే ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రావడం.. కేంద్ర కేబినెట్ నుంచి తెలుగుదేశం తప్పుకోవడం.. కర్ణాటక ఎన్నికలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి హీట్‌‌ను పెంచే పరిణామాలు చోటు  చేసుకోవడంతో వైసీపీ ఎంపీల రాజీనామాల విషయాన్ని జనం మరచిపోయారు. అయితే టీడీపీ అధినేత ఎక్కడికి వెళ్లినా వైసీపీ రాజీనామా డ్రామాలు ఆడుతోందని.. వాటిని ఆమోదించరని...ఉప ఎన్నికలకు వెళ్లేందుకు ధైర్యం లేదంటూ వ్యాఖ్యానించేవారు. ఆయన ఒక్కరే కాదు... టీడీపీ నేతలు మొత్తం ఇదే పాట పాడేవారు.

 

ఇలాంటి సమయంలో తమ రాజీనామాలు ఆమోదించాలంటూ వైసీపీ ఎంపీలు స్పీకర్ సుమిత్రా మహాజన్‌‌‌‌ను కలిసి విజ్ఞప్తి చేయడం.. ఆమె రీకన్ఫర్మేషన్ లెటర్లు ఇస్తే ఆమోదిస్తానని చెప్పడంతో.. ఆ పార్టీ ఎంపీలు సంతోషం వ్యక్తం చేశారు. స్పీకర్ నుంచి యాక్సెప్‌‌‌టెన్స్ వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎంపీలు.. ఇక తమ రాజీనామాల విషయంలో మాట్లాడటానికి ముఖ్యమంత్రికి, ఆయన కొడుకుకి ఏం లేదని స్పష్టం చేశారు. ఇంతకాలం ఆ రాజీనామాలు ఆమోదం పొందవు అని ప్రచారం చేసిన టీడీపీ శ్రేణులు స్పీకర్ నిర్ణయంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. వైసీపీ ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానాల్లో ఉపఎన్నికలు వస్తాయా..? రావా..? అన్నది పక్కనబెడితే.. ప్రస్తుతానికి ఒక ప్రహాసనమైతే ముగిసింది. మరి దీనిపై తెలుగుదేశం చీఫ్ ఏ విధంగా ముందుకు వెళతారో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

Follow Us:
Download App:
  • android
  • ios