Asianet News TeluguAsianet News Telugu

రైల్వే జోన్ కోసం 52.22 ఎకరాలు సిద్దంగా ఉంది: విశాఖ కలెక్టర్ మల్లికార్జున

విశాఖపట్టణంలో  రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి  క్లియర్ టైటిల్ తో  52.22 ఎకరాల భూమి సిద్దంగా ఉందని  రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 

 Visakhapatnam Collector  Mallikharjuna Reacts on  Union Railway Minister ashwini vaishnaw lns
Author
First Published Feb 2, 2024, 2:04 PM IST | Last Updated Feb 2, 2024, 2:05 PM IST

విశాఖపట్టణం:  విశాఖపట్టణంలో  రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి  ఈ ఏడాది జనవరిలోనే  భూమిని సిద్దంగా ఉంచామని  అధికారులు ప్రకటించారు. విశాఖపట్టణంలో రైల్వే జోన్ ఏర్పాటుకు  సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తే  పనులు ప్రారంభిస్తామని  కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆశ్విని వైష్ణవ్ ఈ నెల  1వ తేదీన ప్రకటించారు.ఈ విషయమై  విశాఖపట్టణం జిల్లా కలెక్టర్ మల్లికార్జున  స్పందించారు. 

విశాఖపట్టణంలో రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి  అవసరమైన  52.22 ఎకరాల భూమి సిద్దం చేసినట్టుగా కలెక్టర్  తెలిపారు. ఈ విషయమై  రైల్వేశాఖకు  లేఖ రాసినా కూడ స్పందించలేదని కలెక్టర్   మాట్లాడారు. 

రైల్వే జోన్ ఏర్పాటు విషయమై భూమి కేటాయింపు విషయమై  ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. క్లియర్ టైటిల్ ఉన్న భూమిగా కలెక్టర్  పేర్కొన్నారు. ఓ తెలుగు న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కలెక్టర్ ఈ విషయాలను పేర్కొన్నారు.

also read:Union Budget 2024: 'విశాఖపట్టణంలో రైల్వేజోన్‌ ఏర్పాటుపై కేంద్రం స్పష్టత'

సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ను విశాఖపట్టణంలో ఏర్పాటు చేసేందుకు  డీపీఆర్, నిధులు కూడ సిద్దంగా ఉన్నట్టుగా కేంద్ర మంత్రి ఆశ్విని వైష్ణవ్ చెప్పారు. అయితే  రాష్ట్ర ప్రభుత్వం భూమిని తమకు కేటాయిస్తే  ఈ పనులు ప్రారంభిస్తామన్నారు. 

అయితే రైల్వేశాఖకు  నెల రోజుల క్రితమే ఈ విషయమై  లేఖ పంపినట్టుగా విశాఖపట్టణం కలెక్టర్  స్పష్టం చేశారు. ఈ విషయమై  రైల్వే శాఖ ఉన్నతాధికారులతో కూడ  ఫోన్ లో కూడ సంప్రదింపులు జరిపిన విషయాన్ని కూడ ఆయన ఆ ఇంటర్వ్యూలో గుర్తు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలు సంస్థలు ఇస్తామని  అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ హామీల్లో భాగంగానే  విశాఖపట్టణంలో ప్రత్యేక రైల్వే జోన్ కూడ ఉంది.  అయితే  రాష్ట్ర విభజన జరిగిన పదేళ్లు జరుగుతున్న ఈ చట్టంలో పొందుపర్చిన అంశాలు ఇంకా  అమలు కాని పరిస్థితి నెలకొంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం  కేంద్ర ప్రభుత్వం  అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులతో ఈ కమిటీ తరచుగా సమావేశాలు నిర్వహిస్తుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios