Asianet News TeluguAsianet News Telugu

పవన్ కు బడ్జెట్ పట్టదా...

బడ్డెట్  రంగు రుచి వాసన ఏమిటో పవన్ నోట వినాలని చాలా మంది అనుకుంటున్నారు. ఒక్క పవన్ తప్ప అంతా మట్లాడారు.

What is pawan kalyans take on union budget

తెలుగోళ్ల ఆశల మీద నీళ్లు చల్లిన అరుణ్ జైట్లీ  కేంద్ర బడ్జెట్ మీద జన సేనాని  పవన్ కళ్యాణ్ ఇంకా స్పందించకపోవడం ఆశ్యర్యంగా ఉంది. 

 

ప్రత్యేక హోదా మీద  పవన్ ఈ మధ్య కొన్ని ట్వీట్లు పంపి,  విలేకరులతో  మాట్లాడి, కొన్ని పర్యటలన జరిపి కొంత సంచలనం తీసుకువచ్చారు. అయితే, ఈ వరవడి కొనసాగకపోవడం సరికాదు. భారత దేశంలో 110 కోట్ల మంది బతుకులను శాసించే  బడ్జెట్ మీద ఇంకా ఇంక స్పందింక పోవడం వింతే.

 

ఎందుకంటే, ఆయన పార్ట్ టైం రాజకీయాలు మానేసి ఎన్నికలలో కూడా పోటీచేయాలనుకుంటున్నారు.ఏలూరు అడ్రసులో,అనంతపురం పార్టీ కార్యాలయం అని కూడా ప్రకటించారు. అలాంటపు ఈ బడ్డెట్ ఎలా రంగు రచి వాసన ఏమిటో పవన్ నోట వినాలనుకోవడం సహజం. అందరు స్పందించారు, ఒక్క పవన్ తప్ప.

 

కనీసం ఆయన ట్విట్టర్ నుంచి   తన అభిప్రాయం ప్రసారం చేయలేదు. ఏమౌనం సరిఅయినదా. లేక బడ్జెట్ అర్థం కాలేదేమో అనే అనుమానాలొస్తాయి.

 

బడ్జెట్ వచ్చేది ఏడాది కొకసారి. బడ్జెట్ తయారీ దేశ వ్యాపితంగా ఎంతో ఉత్కంఠ రేకెత్తిస్తుంది. మరొక ఏడాది దాకా చెరగని విధంగా అది దేశ ప్రజల తలరాస్తుంది. అలాంటపుడు బడ్జెట గురించి తన అభిప్రాయం , తన పార్టీ అభిప్రాయం వెల్లడించాలి. అలా ప్రాంతీయ జాతీయాంశాలమీద స్పందించడం మొక్కుబడి కాదు అదిజాతీయ ప్రభుత్వం మీద వత్తిడిపెంచుతుంది. అంతేకాదు, ఒకపార్టీ లేదా ఒక నాయకుడికి సమాజంతో సజీవ సంబంధాలున్నాయనేందుకు గుర్తు. అందుకే వైఎస్ఆర్ సి ప్రశ్న సరైందనే అనిపిస్తుంది.

 

రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ మినహాయింపు మీద టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారని ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఇవ్వనందుకు వారికి చీమకుట్టినట్లు కూడా లేదని వైఎస్ఆర్ సీపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు గుడివాడ్ అమర్నాథ్‌  విమర్శించారు.

 

“ఆదేమో గాని, ఓటుకు కోట్ల కేసు తర్వాత రాష్ట్రానికి ఏ అన్యాయం జరిగినా చంద్రబాబుకు న్యాయంగా  కనిపిస్తున్నది,” అని ఆయన ఆరోపించారు. ఆలాగే,  పవన్ మౌనం మీద ఆయన వ్యాఖ్యానించారు.

 

ఆంధ్రప్రదేశ్‌‑కు ప్రత్యేక హోదా కోసం వరుసగా ట్వీట్లు చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎందుకు ప్రశ్నించరని అమర్నాథ్‌ అడుగుతున్నారు. ప్రభుత్వ తీరుపై పవన్ కల్యాణ్‌ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని చెప్పారు.

 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios