మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గానికి, అక్కడి ప్రజలకు ఇన్నేళ్లలో ఏం చేయలేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఆదివారం ఆమె తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు.

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయాధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు (chandrababu nayudu) కుప్పం నియోజ‌క‌వ‌ర్గానికి, అక్క‌డ ప్ర‌జ‌ల‌కు ఏం చేయలేద‌ని వైసీపీ ఎమ్మెల్యే రోజా (mla roja) ఆరోపించారు. ఆదివారం ఉద‌యం ఆమె తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో స్వామివారిని ద‌ర్శించుకున్నాడు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు నాయుడుపై విమ‌ర్శ‌లు చేశారు. జ‌గ‌న్ (jagn) దెబ్బ‌ను త‌ట్టుకోలేక చంద్ర‌బాబు త‌న నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లార‌ని అన్నారు. అక్క‌డి ప్ర‌జ‌ల‌కు మాజీ సీఎం చేసిందేమీ లేద‌ని అన్నారు. లోకల్ బాడీ ఎన్నిక‌ల్లో ప్ర‌జా తీర్పుతో చంద్ర‌బాబు నాయుడు త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఇళ్లు క‌ట్టుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని అన్నారు. ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా ప్ర‌జ‌లంద‌రూ సీఎం జ‌గ‌న్ వైపే ఉంటార‌ని తెలిపారు. టీడీపీ (tdp) నుంచి 23 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నిక‌లను ఎదుర్కోవాల‌ని అన్నారు. ఆ ఎన్నిక‌ల ఫ‌లితాలే ప్ర‌జ‌లు ఎవరి వైపు ఉన్నారో అని తేల్చుతాయ‌ని రోజా అన్నారు. 

మరో వైపు శనివారం నాడు మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కూడా మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడిపై ఆరోప‌ణ‌లు చేశారు. కుప్పంలో తాను గ్రానైట్ అక్ర‌మ మైనింగ్ చేసిన‌ట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని స‌వాల్ అన్నారు. చంద్ర‌బాబు సీనియర్ ఎమ్మెల్యేగా ఉండి జిల్లాకు ఏం చేశాడ‌ని ఆయ‌న‌ ప్ర‌శ్నించారు. కుప్పంను అభివృద్ది చేయాల‌ని క‌ల‌లు క‌న్నాడ‌ని చెబుతున్నార‌ని.. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశార‌ని ఆయన ప్ర‌శ్నించారు. ఐదేళ్లలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌జ‌ల‌కు దేవుడు అయ్యార‌ని, చంద్ర‌బాబు చిత్తూరు జిల్లాలో పుట్ట‌డం అంద‌రి దుర‌దృష్ట‌మ‌ని విమ‌ర్శించారు. చంద్ర‌బాబు సీఎం‌గా ఉన్న‌ప్పుడు మైనింగ్ రాయ‌ల్టీపై క‌న్సెష‌న్ ఎందుకు ఇచ్చార‌ని మంత్రి ప్ర‌శ్నించారు.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఓడిపోయినందుకే చంద్ర‌బాబుకు ఇంతలా బాధ‌వేస్తుందంటూ మంత్రి ఆరోపించారు. చంద్ర‌బాబు దుష్ట‌పాల‌న‌ను వ‌దిలించుకోవ‌డానికి త‌మ పార్టీకి ప్ర‌జ‌లు 151 సీట్లు ఇచ్చార‌ని అన్నారు. ఇప్పుడు సిగ్గులేకుండా కుప్పంలో ప‌ర్యటిస్తున్నార‌ని మంత్రి పెద్దిరెడ్డి దుయ్యబట్టారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాబును తప్ప‌కుండా ఓడిస్తామ‌ని, ఇది త‌ప్ప‌కుండా జ‌రుగుతుంద‌ని రామచంద్రారెడ్డి జోస్యం చెప్పారు. బాబు ఎన్ని చెప్పినా చిత్తూరు జిల్లా ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. 

ఇదిలా ఉండ‌గా టీడీపీని ఇబ్బంది పెట్టే వాళ్లని వదిలి పెట్టబోనని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గ‌త శుక్రవారం నాడు అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. మరో రెండేళ్ల తర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు తాను మరోసారి సీఎం అవుతానని చంద్ర‌బాబు నాయ‌కుడు ధీమా వ్యక్తం చేశారు. సీఎం కాగానే టీడీపీని ఇబ్బంది పెట్టే వాళ్ల అంతు చూస్తాన‌ని తేల్చి చెప్పారు. తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందుల పెట్టిన వారిని వదిలి పెట్టనని చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే కమిషన్ ఏర్పాటు చేసి వారిని శిక్షిస్తామన్నారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాల్సిందేనన్నారు. ఏ వ్యక్తి చేసినా తప్పు తప్పేనని చంద్రబాబు అన్నారు. త‌మ‌ను ఇబ్బందుల‌కు గురి చేసే వారిని శిక్షిచ‌డంలో ఎలాంటి త‌ప్పు లేద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.