Asianet News TeluguAsianet News Telugu

( వీడియో) దావోస్ లో ఆంధ్రా ఫుల్ మీల్స్

దావోస్ నుంచి ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు ఏమితెస్తున్నారో నని రాష్ట్రమంతా ఎదురుచూస్తూ ఉంది

what Chandrabu did in Davos for three days

"వరల్డ్ ఎకానమిక్ ఫోరం" లో "ఆంధ్రప్రదేశ్ పెవిలియన్" ను ఏర్పాటు చేసి, ప్రపంచంలోని గొప్పగొప్ప కంపనీల ప్రతినిధులతోనూ, సి‌ఈ‌ఓ లతోనూ ఎడతెరిపిలేని చర్చలు చేస్తూ, ఆంధ్రాలో పెట్టుబడులకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  తెగ కష్టపడుతుడనిపిస్తుంది. అయితే, అక్కడ జరుగుతున్నదేమిటో చూద్దామని, తెలుసుకుందామని  నేనూ చాలా కష్టపడ్డాను.  చాలా వీడియోలన్నీ చూశా... ..... అన్నీ చూశాక నాకర్థమయ్యిందేమిటంటే, "ఒక మంచి పి‌ఆర్‌ఓ ను పెట్టుకొంటే" ఎంత షోఆఫ్ ఐనా చేయవచ్చు అని..!

మన దేశంలోని ఏ రాష్ట్రమూ ఏర్పాటుచేయని విధంగా, "వరల్డ్ ఎకానమిక్ ఫోరం" లో ఏకంగా ఒక పెవిలియన్ ను ఏర్పాటుచేయడం" అంటే మాటలుకాదుకదా అని ముందు ఆశ్చర్యపోయా! 


.
..... తీరా వెతికితే తెలిసిందేమిటంటే, ఆ మీటింగ్ జరుగుతున్న బిల్డింగ్ బయటే "CAFE SCHNEIDER" అనే ఒక రెస్టారెంట్ లో మనోళ్ళు దుకాణం పెట్టారు.  అదే నండి "పెవిలియన్". "ఆంధ్రా సంత" అన్నమాట.! - ఆ హోటల్ వాడికి పండగే..!!
.


 వీళ్ల దుకాణంలో ఒకటేమిటి, ఆంధ్రా టిఫిన్లు,  ఆంధ్రా భోజనం, ఆంధ్రా డిన్నర్, పాలకూర పప్పు , బెండకాయ వేపుడు  పులుసు,  కొత్తిమీర అన్నం.. ఇలా ఒకటేమిటి, వచ్చినోళ్లందరికీ షడ్రసోపేతమైన మృష్టాన్నభోజనంతో కూడిన ఆతిథ్యమన్నమాట.! – ఇదంతా ఎవరి సొమ్మని అడగ్గలమా!! 
 

ఇకపోతే, అక్కడ జరిగే తంతు చూడండి
 

 

ఒక మంచి "కన్సల్టింగ్ ఏజెన్సీ" ని నియమింపజేసుకొని, "వరల్డ్ ఎకానమిక్ ఫోరం" కు వచ్చే వివిధ కంపనీల ప్రతినిధులతో ముందుగానే ఒక ప్రోగ్రాం ఫిక్స్ చేసుకొని, మన చంద్రన్న తో మీటింగ్ ఏర్పాటు చేయడం.. ఈయనా, వీళ్ళ ప్రతినిధి బృందం, అదేనండీ, పరకాల & బ్యాచీ తోసహా కూర్చొని చర్చలు... ఆ చర్చలంటే మరేమీ ఉండదు.. 

 "ఆయామ్ యూజింగ్ టెక్నాలజీ"
 "ఐ వాంట్ బ్రింగ్ న్యూ టెక్నాలజీ"
"ఆయామ్ హ్యావ్ ఎ డ్యాష్ బోర్డ్"
“ ఆయామ్ మానిటర్ ఫ్రమ్ కమాండ్ సెంటర్"
 "ఐ స్విచ్ ఆఫ్ స్ట్రీట్ లైట్ ఫ్రమ్ సి‌ఎం ఆఫీస్"
 "ఐ డూ లైవ్ మానిటరింగ్ ఆఫ్ స్ట్రీట్ గార్బేజ్"
 "ఆయామ్ కంట్రోల్ క్రైమ్ విత్ సి‌సి టి‌వి కెమెరా"
 "ఆయామ్ టేక్ పిక్చర్ ఆఫ్ పబ్లిక్ టాయ్లెట్ ఎవ్రి 4 అవర్స్" 
 "ఐ వాంట్ మేక్ అమరావతి ఎ బ్రాండ్"
 "అయామ్ ఫ(Fa)వర్ సర్ప్లస్ స్టేట్"
 "వి ఆర్ ఎ న్యూ స్టేట్" - వి హ్యావ్ గ్రేట్ అపార్చునిటీస్".


.... ఇలా చెప్పి, ఎదుటివాళ్ళు అవాక్కయ్యేలోపుగా వాళ్లమీద ఒక "పసుపు పచ్చ శాలువా కప్పి, ఒక బుద్ధుని ఫోటో చేతిలోపెట్టి, "దిసీద్ది గ్రేట్ నెస్ ఆఫ్ అమరావతి" అంటూ మరో పుస్తకాన్ని చేతిలోపెట్టి దండంపెట్టేయడం..!!
 

ఇలా వచ్చినవాళ్లందరికీ ఆతిథ్యం ఇవ్వడం - దిసీజ్ తెలుగోడి గొప్పదనం అంటూ చెప్పేయడం. ఆయామ్ ఇన్వైటింగ్ యు ఆల్ దేర్ అంటూ నమస్తే పెట్టేయడం. వీళ్ళకొక పెద్ద అధికారుల టీం. గత మూడురోజులుగా జరుగుతున్న తంతు ఇదన్నమాట..!!


 ఎంతమందిని కలిసినా - ఎన్ని మీటింగులు పెట్టుకొన్నా - ఎన్ని కబుర్లు చెప్పినా, చివరికి, కోట్లాదిరూపాయల ప్రజలసొమ్మును నీళ్లలాగా ఖర్చుచేసినా, దీనివల్ల ఒరిగేది శూన్యం.. కేవలం చంద్రబాబుకు పబ్లిసిటీ రావడం రాబోయేరోజుల్లో ఫ(Fa)వర్ పాయింట్ ప్రెజెంటేషన్లలోకి వాడుకోవడానికి సరిపడా ఫోటోలను తయారుచేసుకోవడానికి తప్ప..!!
.
...... ఇంతకీ ఈ దావోస్ పర్యటన "కన్సల్టింగ్ కాంట్రాక్ట్" ఎవరిదో..!!   పరకాల గారి యాంకరింగ్ చూడండి..!!

 

( ఇందులో వ్యక్తం చేసినవి రచయిత సొంత అభిప్రాయలు)
.

Follow Us:
Download App:
  • android
  • ios