బహిర్భూమి కోసం చెరువు వద్దకు వెళ్లిన దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుడు నీటిలో మునిగి మరణించాడు. ఈ ఘటన కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలు మండలంలో చోటు చేసుకుంది.

బహిర్బూమికి అని వెళ్లి.. మట్టి తవ్వకాల వల్ల చెరువులో ఏర్పడిన భారీ గుంతల్లో పడి యువకుడు మరణించాడు. ఈ ఘటన కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలు మండలంలోని తాటిపర్తి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. కాగా ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. అక్రమ మట్టి తవ్వకాలే యువకుడి మరణానికి కారణమైందంటూ నిరసన చేపట్టారు.

BRS: బీఆర్ఎస్ కు త‌ల‌నొప్పిగా మారుతున్న సొంత నాయ‌కుల వ్యాఖ్య‌లు !

వివరాలు ఇలా ఉన్నాయి. తాటిపర్తి గ్రామానికి చెందిన దళిత సామాజికవర్గానికి చెందిన సుబ్బారావు (33) కూలి పనులు చేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య నాగలక్ష్మి, పదో తరగతి చదివే కుమారుడు సురేష్, ఐదో తరగతి చదివే కూతురు ప్రియదర్శిని ఉన్నారు. ఈ క్రమంలో సుబ్బారావు ఆదివారం సాయంత్రం బహిర్భుమికి వెళ్లాలనే ఉద్దేశంతో కోదండరామ చెరువు సమీపంలోకి వెళ్లాడు.

దొంగ‌త‌నం చేశార‌నే అనుమానంతో చెట్టుకు తలక్రిందులుగా వేలాడదీసి న‌లుగురు దళితులపై దాడి

కొంత సమయం తరువాత కాలు జారి అతడు చెరువులో పడి పోయాడు. ఆ చెరువులో గతంలో మట్టి కోసం తవ్వకాలు జరపడం వల్ల పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. సుబ్బారావు నీటిలో మునిగిపోతుండగా పలువురు గమనించి చెరువు వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. నీటిలోకి దూకి సుబ్బారావు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయం తెలియడంతో పోలీసులు, అగ్నిమాక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది, గత ఈతగాళ్లు కలిసి నీటిలో దిగి ఆ యువకుడి కోసం గాలించారు. అయితే సాయంత్రం 6.30 గంటల సమయంలో డెడ్ బాడీని బయటకు తీసుకొని వచ్చారు. 

Rozgar Mela: కొత్తగా ఉద్యోగాల్లో చేరే 51 వేల మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు అందించ‌నున్న ప్ర‌ధాని మోడీ

కాగా.. డెడ్ బాడీని పోలీసులు పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ బాధిత కుటుంబ సభ్యులు దానికి అంగీకరించలేదు. అనంతరం తాటిపర్తి-వన్నెపూడి మెయిన్ రోడ్డుపై వారు డెడ్ బాడీతో గ్రామస్తులు నిరసన చేపట్టారు. అక్రమ మట్టి తవ్వకాల వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సుబ్బారావు భార్యకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. కాగా.. ఈ నిరసనకు టీడీపీ, జనసేన నాయకులు మద్దతు ప్రకటించారు.