ఏపీలో అసలు సిసలు ప్రజా రాజకీయం రావాలి: కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన ఏపీ నేతలు

ఏపీ రాష్ట్రంలో  అసలు సిసలు రాజకీయం  ప్రారంభం కావాలని తెలంగాణ సీఎం కేసీఆర్  చెప్పారు. దేశంలో మార్పు కోసం బీఆర్ఎస్   పనొ చేస్తుందని కేసీఆర్ చెప్పారు. 

We Will start  BRS Activity After Snakranti Festival :KCR

హైదరాబాద్:దేశ రాజకీయాల్లో  మార్పు తీసుకురావడమే బీఆర్ఎస్ లక్ష్యమని తెలంగాణ సీఎం కేసీఆర్  చెప్పారు. సోమవారం నాడు రాత్రి  ఏపీకి చెందిన  తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు,  పార్థసారథి సహా పలువురు   బీఆర్ఎస్ లో చేరారు. హైద్రాబాద్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన  కార్యక్రమంలో  కేసీఆర్  ప్రసంగించారు.భారత్  ను ఉజ్వలంగా తీర్చిదిద్దడంలో  ఏపీ కూడా కీలక పాత్ర  పోషించాలని  కేసీఆర్ కోరారు. ఏపీలో  అసలు సిసలు ప్రజా రాజకీయం రావాలన్నారు. ఏపీలో మేమే  కర్తలమనే ధోరణి పోవాలన్నారు. దేశంలోని నాలుగు వేల అసెంబ్లీ నియోజకవర్గాల్లో సంక్రాంతి తర్వాత కార్యాచరణను ప్రారంభించనున్నట్టుగా  కేసీఆర్  ప్రకటించారు. 

బీఆర్ఎస్ ఈజ్ ఫర్ ఇండియా అని ఆయన చెప్పారు.  ఏ వర్గం కోసమో, కులం కోసమో, మతం కోసమో,  బీఆర్ఎస్ ఏర్పాటు చేయేలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అంటే తమాషా కోసం పెట్టిన పార్టీ కాదని కేసీఆర్ స్పష్టం చేశారు.. మహోజ్వల  భారత నిర్మాణం కోసమే బీఆర్ఎస్ ను   ఏర్పాటు చేసినట్టుగా  కేసీఆర్ వివరించారు.  దేశంలోని ఆలోచనపరులను ఏకం చేస్తున్నట్టుగా  కేసీఆర్ చెప్పారు.  దేశంలో మార్పు తీసుకురావడమే బీఆర్ఎస్ లక్ష్యమన్నారు.  ఏం చేసైనా సరే ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా రాజకీయాలు సాగుతున్నాయని  కేసీఆర్  చెప్పారు. 

లక్షకిలోమీటర్ల ప్రయాణమైనా  ఒక్క అడుగుతోనే మొదలు కానుందన్నారు.  లక్ష్యసిద్ది ఉంటే  సాధించలేనిది ఉండదన్నారు.  ఏ గొప్ప పని ప్రారంభించినా  అవహేళనలు తప్పవని  కేసీఆర్ గుర్తు చేశారు.స్వాతంత్ర్య ఫలాలు పూర్తిస్థాయిలో సిద్దించలేదని  సీఎం కేసీఆర్  చెప్పారు. ఒకప్పుడు  రాజకీయాలంటే త్యాగమన్నారు..బీఆర్ఎస్ ఎజెండాను దేశ వ్యాప్తం చేసేందుకు నేతలు తమ పార్టీలో చేరుతున్నారన్నారు. భారత్ లో అద్భుతమైన వ్యవసాయ అనుకూల వాతావరణం ఉందని  కేసీఆర్ గుర్తు చేశారు. భారత్ కంటే  అమెరికా, చైనా దేశాలు వైశ్యాలంలో పెద్దవన్నారు. కానీ  ఈ రెండు దేశాల్లో  వ్యవసాయ యోగ్యమైన భూమి  ఇండియా కంటే చాలా తక్కువేనని కేసీఆర్ గుర్తు చేశారు. 
దేశంలో  పుష్కలమైనా వనరులున్నా ఢిల్లీలో రైతులు ఎందుకు ధర్నాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని ఆయన ప్రశ్నించారు. భారత ప్రభుత్వం  నిజాయితీగా ఉంటే  దేశంలోని  ప్రతి ఎకరాకు నీటిని అందించవచ్చన్నారు.   దేశంలో  70 వేల టీఎంసీల నీటి వనరులున్నాయన్నారు. కానీ  దేశ రాజధాని ఢిల్లీ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఎందుకు  తాగు నీటి కొరత  ఉందని  కేసీఆర్ ప్రశ్నించారు. 

also read:బీఆర్ఎస్ లో చేరిన ఏపీ నేతలు: కేసీఆర్ సమక్షంలో రావెల, తోట సహా పలువురు గులాబీ పార్టీలో చేరిక

మన దేశంలో బెస్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అభివృద్ది చేస్తే అద్భుతంగా ఉంటుందని కేసీఆర్  చెప్పారు. అన్ని వనరులు ఉండి కూడ దేశం ఎందుకు అభివృద్ది చెందడం లేదని ఆయన ప్రశ్నించారు.ఈ విషయమై  మేథావులు, యువత ఆలోచించాలని కేసీఆర్ కోరారు. ఏమీ లేని సింగపూర్ అభివృద్ది ఎలా సాధించిందో మనం చూస్తున్నామన్నారు.  చైనా ప్రపంచంలోనే  అగ్రదేశాల్లో  ఎలా ముందకు సాగుతుందని  ఆయన ప్రశ్నించారు.  ఒకప్పుడు  చైనా జీడీపీ ఇండియా కంటే తక్కువన్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు , కానీ పార్టీలు, నాయకులు గెలుస్తున్నారని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.   పవర్ పుల్ గా పేరున్న ఇందిరాగాంధీని కూడా ప్రజలు ఓడించారన్నారు.  ఇందిరాను ఓడించిన తర్వాత  మరో రెండేళ్లకే ప్రజలు తిరిగి మళ్లీ  ఆమెను అధికారంలో కూర్చొబెట్టారని కేసీఆర్ గుర్తు చేశారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios