ప్రభుత్వానికి రెండు నెలల సమయం ఇచ్చిన ముద్రగడ. డిసెంబర్ 6 వ తేదీ వరకు ప్రభుత్వానికి గడువు. గడువు వరకు హామీ అమలు చెయ్యకపోతే ఉద్యమం ఉదృతం.

" చంద్ర‌బాబు నాయుడికి డిసెంబ‌ర్ ఆరు త‌రువాత మా త‌డ‌ఖా చూపిస్తాం"...ఇది కాపు ఉద్యమ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం తాజాగా చేసిన హెచ్చ‌రిక‌. ఈ రోజు 13 జిల్లాల్లో ఉన్న‌ కాపు ఉద్య‌మ నేత‌ల‌తో స‌మావేశం అయ్యారు. త‌రువాత మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌బాబుకు తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. 



కాపుల రిజర్వేషన్ పై చంద్ర‌బాబు ఇచ్చిన హామీని నిల‌బెట్టుకునే వ‌ర‌కు పోరాటం చేస్తామ‌న్నారు. మంజునాధ క‌మీష‌న్ త‌న నివేధిక‌ను స‌మ‌ర్పించ‌డానికి రెండు నెల‌ల్లోపు వ‌స్తుంద‌ని చంద్ర‌బాబు చెప్పారు. కాబ‌ట్టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వానిక రెండు నెల‌లు గ‌డువు ఇస్తున్నామ‌న్నారు. డిసెంబ‌ర్ 6వ తేదీ వ‌ర‌కు త‌న పాద‌యాత్ర‌ను వాయిదా వేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. అమ‌లుచేయక‌పోతే ప్ర‌భుత్వం పై పోరు ఉదృతంగా ఉంటుంద‌ని, అప్పుడు ఏ స్థాయి బ‌ల‌గాలు వ‌చ్చిన త‌మ‌ని ఆప‌లేవ‌ని ఆయ‌న వార్నింగ్ ఇచ్చారు. ఉద్య‌మాన్ని అణిచేందుకు ప్ర‌భుత్వం ఏం చేసిన వెన‌క్కి త‌గ్గమ‌న్నారు.

ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు మారాల‌ని సూచించారు, ఇంట‌లిజెన్స్ రిపోర్టులు ఆయ‌న‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాయ‌న్నారు. త‌క్ష‌ణ‌మే వారి స్థానంలో నూత‌న సిబ్బందిని నియమించాల‌న్నారు.