తన  తల్లి  ఆరోగ్యం మెరుగుపడిందని  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  చెప్పారు.  మెరుగైన చికిత్స  కోసం  హైద్రాబాద్ కు తరలిస్తామన్నారు. 

కర్నూల్: తన తల్లి ఆరోగ్యం మెరుగుపడిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చెప్పారు. అయితే గుండెకు సంబంధించిన చికిత్సకు సంబంధించి చికిత్స కోసం ఆమెను హైద్రాబాద్ కు తరలిస్తున్నామని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. 

శుక్రవారంనాడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.మెరుగైన వైద్యం కోసం అమ్మను హైద్రాబాద్ కు తరలిస్తున్నామన్నారు. ఈ సమయంలో మీడియాకు ఇబ్బంది కల్గిస్తే మనసులో పెట్టుకోవద్దని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయమై మాట్లాడేందుకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నిరాకరించారు. ఈ కేసు కోర్టు లో ఉన్నందున మీడియాతో మాట్లాడితే ఇబ్బందులు ఎదురౌతాయని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయమై మాట్లాడేందుకు వైఎస్ అవినాష్ రెడ్డి నిరాకరించారు.