ముద్దాయిలు ఆరోపణలు చేస్తే పట్టించుకొంటామా: పరకాల రాజీనామాపై సోమిరెడ్డి

We will not accept Parakala prabhakar resignation says Ap minister Somireddy chandramohan reddy
Highlights

పరకాల ప్రభాకర్  రాజీనామాపై సోమిరెడ్డి వ్యాఖ్యలు


అమరావతి: ఏపీ రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారుడు  పరకాల ప్రభాకర్ రాజీనామాను ఆమోదించబోమని  ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  స్పష్టం చేశారు.

 అమరావతిలో మంగళవారం  నాడు  ఏపీ రాష్ట్ర  వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి  చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పనిలేని వారి ఆరోపణలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన  చెప్పారు. 

ముద్దాయిల ఆరోపణలను  అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదన్నారు.  రాష్ట్రంలో అభివృద్ది పనులు చేస్తోంటే వైసీపీ నేతలు  సహకరించకుండా తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆయన  మండిపడ్డారు. 


రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహదారుగా పనిచేస్తున్న  పరకాల ప్రభాకర్‌పై  కూడ వైసీపీ నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు.వైసీపీ ఆరోపణలను సీరియస్‌గా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పరకాల ప్రభాకర్ రాజీనామాను తాము ఆమోదించబోమని ఆయన తేల్చి చెప్పారు.

loader