అమరావతి: 10 రోజుల్లోనే రేషన్ కార్డు, 20 రోజుల్లోనే ఆరోగ్యశ్రీ కార్డులు, 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు అందిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. మంగళవారం నాడు స్పందన కార్యక్రమంపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్ధిష్ట కాల పరిమితితో అర్హులందరికీ కూడ పథకాలను అందిస్తామని ఆయన ప్రకటించారు. ధరఖాస్తు చేసుకొన్న అర్హులైన వారికి రేషన్, పెన్షన్ కార్డు లను పది రోజుల్లో అందిస్తామన్నారు. 

 44 లక్షల నుంచి 58 లక్షలకుపైగా పెన్షన్లు పెంచామని గుర్తు చేశారు. అర్హులకు రూ.2,250 పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. అవినీతి లేని వ్యవస్థను తీసుకొచ్చామని ఆయన గుర్తు చేశారు. పథకాల అమలుకు సంబంధించి కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆయన సూచించారు

లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలి. అర్హత వివరాలు, దరఖాస్తు చేసుకునే సమాచారం కూడా అందించాలన్నారు.వచ్చిన దరఖాస్తును గడువులోగా వెరిఫికేషన్‌ చేయాలి. లబ్దిదారులకు బియ్యం కార్డులు, పింఛను కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులను డోర్‌ డెలివరీ చేయాలి. బయెమెట్రిక్‌ అక్నాలెడ్జ్‌మెంట్‌ తీసుకోవాలన్నారు.

నిర్ణీత సమయంలోగా ఆ సేవలు అందించలేకపోతే వారికి పరిహారంకూడా చెల్లిస్తామని ఆయన కోరారు.. కలెక్టర్లు, జేసీల పనితీరు దీనిపై ఆధారపడి ఉంటుందన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం ఎవరైనా మిగిలిపోతే అప్లికేషన్లు పెట్టమని చెప్పామని అధికారులు సీఎంకు తెలిపారు. 

also read:ఆ పదవి దక్కదనే అక్కసుతోనే ఆవేశం: లోకేష్‌పై విజయసాయి సెటైర్లు

ఇప్పటివరకూ 30.3 లక్షల మందిని లబ్ధిదారులుగా గుర్తించామని అధికారులు చెప్పారు. జూన్‌ 12 కల్లా లబ్దిదారుల తుది జాబితాను ప్రదర్శించాలని సీఎం ఆదేశించారు.

జూన్‌ 15 కల్లా పాత లబ్దిదారులకు సంబంధించి ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు అవసరమైన కార్యక్రమాలు పూర్తిచేయాలని అన్నారు. జూన్‌ 30 కల్లా కొత్త లబ్ధిదారులకు సంబంధించి ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు అవసరమైన కార్యక్రమాలు పూర్తిచేయాలని సీఎం చెప్పారు.

ఏవైనా సమస్యలు ఉంటే కచ్చితంగా ప్లాన్‌ బి ఉండాలని సీఎం సూచించారు. జూన్‌ 15 కల్లా ప్లాన్‌ బి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పారు. జులై 8 నాటికి ఇళ్లపట్టాలు ఇవ్వాలని సీఎం అన్నారు.