టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు.  లోకేష్ ఆవేశం చూస్తే ఏదో ఉప్రదవం ముంచుకొచ్చినట్టే కన్పిస్తోందన్నారు. ట్విట్టర్ వేదికగా లోకేష్ పై తనదైన శైలిలో విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. 


అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. లోకేష్ ఆవేశం చూస్తే ఏదో ఉప్రదవం ముంచుకొచ్చినట్టే కన్పిస్తోందన్నారు. ట్విట్టర్ వేదికగా లోకేష్ పై తనదైన శైలిలో విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…

టీడీపీ అధ్యక్ష పదవికి తనను కాదని మరొకరిని ఎంపిక చేయడం వల్ల లోకేషన్ కు తన్నుకొచ్చిన 'ఆవేదన తాలూకు ఉద్రేకం' బయటపడినట్టుగా కన్పిస్తోందన్నారు. పనికిరాడని తండ్రే సర్టిఫై చేస్తే తన భవిష్యత్తు ఏమిటోనని లోకేష్ కుంగిపోతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌షా కాళ్లు పట్టుకోవడం ఎలా అనే దానిపై చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. హైద్రాబాద్ లో ఉంటున్న బాబుకు మనసంతా ఢిల్లీ చుట్టూ తిరుగుతోందన్నారు. బీజేపీకి దగ్గర కావాలని తన మనుషులతో ఇప్పటికే బాబు అనిపించారన్నారు. బీజేపీకి దగ్గర కావడం చారిత్రక అవసరమని ఎల్లో మీడియా వరుసగా కథనాలు ప్రచురిస్తోందన్నారు.

రౌడీషీటర్లకు చంద్రబాబు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చాడు. ఎక్కడ రక్తపాతం జరిగినా కూడ బాబు శిష్యులే ఉంటారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే 60 ఏళ్ల వృద్దురాలిపై 13 ఎప్ఐఆర్ లు నమోదయ్యాయని పరోక్షంగా రంగనాయకమ్మ పేరును ప్రస్తావించారు.