జనసేనతో పొత్తుపై ట్విస్టిచ్చిన సోము వీర్రాజు

We will contest all seats in Ap state in   2019 elections says Somu Veerraju
Highlights

పవన్ వ్యాఖ్యల్లో తప్పేముంది

అమరావతి: 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో  
పోటీ చేస్తామని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు.గత
ఎన్నికల్లో  జనసేనతో కలిసి పోటీ చేయాలని భావించామని
ఆయన చెప్పారు.

శుక్రవారం నాడు ఆయన రాజమండ్రిలో మీడియాతో
మాట్లాడారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తన యాత్రలో
వాస్తవాలనే ప్రజలకు వివరిస్తున్నారని సోము వీర్రాజు
చెప్పారు.

2014 ఎన్నికల సమయంలో కూడ టిడిపితో పొత్తును వద్దని
చెప్పామని ఆయన  గుర్తు చేశారు. బిజెపి, జనసేన కలిసి పోటీ
 చేయాలని  ప్రతిపాదించిన విషయాన్ని ఆయన గుర్తు
చేశారు. 

కానీ, మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరిందని ఆయన
చెప్పారు. వైఎస్ కుటుంబంతో తనకు శతృత్వం లేదని
పవన్ చెప్పారన్నారు. అయితే అనుభవం ఉన్న నేత
అవసరమని భావించి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్
మద్దతుగా నిలిచారని వీర్రాజు గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీ నుడి వచ్చిన నేతలకు బిజెపి భావజాలాన్ని
నేర్పిస్తామని వీర్రాజు చెప్పారు. అయితే వచ్చే ఎన్నికల్లో
జనసేనతో పొత్తు విషయాన్ని కాలమే నిర్ణయించనున్నట్టు
సోము వీర్రాజు చెప్పారు.


 

loader