విజయవాడ:  రాంప్రసాద్ పెట్టిన కేసులతో  తమ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల పాలైందని  శ్యామ్ భార్య చెప్పారు

సోమవారం నాడు ఆమె ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.రాంప్రసాద్ కేసుల వల్ల తమ కుటుంబం అన్ని రకాలుగా ఇబ్బందులు పడినట్టుగా ఆమె చెప్పారు.  తమ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్నారు.

కోర్టు కేసులో వాయిదాకు హాజరయ్యేందుకు తన భర్త పాండిచ్చేరికి వెళ్లినట్టుగా ఆమె చెప్పారు.  కోర్టు వాయిదాలకు తన భర్త వెళ్తే తాను వాటర్ ప్లాంట్‌కు వస్తానని ఆమె చెప్పారు.ఇంట్లోని బంగారాన్ని తన భర్త తాకట్టు పెట్టారని శ్యామ్ భార్య చెప్పారు. తన భర్త ప్రతి క్షణం టెన్షన్ పడుతున్నాడని  ఆమె చెప్పారు.రాంప్రసాద్‌ ఎవరో కూడ తనకు తెలియదన్నారు.  

సంబంధిత వార్తలు

రాంప్రసాద్‌ను నేనే హత్య చేశా: శ్యామ్