హైదరాబాద్: రాంప్రసాద్‌ను తన శిష్యులతో కలిసి  హత్య చేసినట్టుగా  శ్యామ్ చెప్పాడు.

సోమవారం నాడు ఆయన ఓ తెలుగు న్యూస్ చానెల్‌కు శ్యామ్ ఇంటర్వ్యూ ఇచ్చారు.  గతంలో తనపై కేసు పెట్టి చిత్రహింసలు పెట్టించారని ఆయన ఆరోపించారు.

తనకు రాంప్రసాద్ రూ. 15 లక్షలు నష్టం కల్గించారని ఆయన ఆరోపించారు. ఈ హత్యకు కోగంటి సత్యానికి సంబంధం లేదన్నారు. తన ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం కావడానికి రాంప్రసాద్ కారణమన్నారు.

కోగంటి సత్యం,తాను ఒకే కేసులో నిందితులమని ఆయన చెప్పారు.15 రోజుల పాటు రెక్కీ నిర్వహించి రాంప్రసాద్‌ను హత్య చేశామన్నారు.కోగంటి సత్యానికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదన్నారు.  రాంప్రసాద్‌ను హత్య చేయిస్తే  ఉర శ్రీనివాస్ తనకు డబ్బులు ఇస్తాడని నమ్మకం ఉందన్నారు.

రాంప్రసాద్‌ హత్యలో నలుగురు వ్యక్తులు పాల్గొన్నట్టుగా చెప్పారు.  అయితే కారు డ్రైవర్ మాత్రం ప్రస్తుతం అదృశ్యమైనట్టు చెప్పారు. హత్య చేసిన తర్వాత విజయవాడకు పారిపోయినట్టుగా ఆయన తెలిపారు.

తమ వాటర్ ప్లాంట్‌లోనే  రాంప్రసాద్‌ను  హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తులను తయారు చేసుకొన్నామని ఆయన తెలిపారు.  రాంప్రసాద్‌ను హత్య చేస్తామని ఇటీవల కాలంలో ఉర శ్రీనివాస్‌కు చెప్పలేదన్నారు. పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో తాను లొంగిపోతానని ఆయన చెప్పారు.